సమీక్ష: మోహన్ లాల్ ‘దృశ్యం 3’ – గురి తప్పిన థ్రిల్లర్ డ్రామా

Drishyam-3

విడుదల తేదీ : మే 21, 2026

123తెలుగు.కామ్ రేటింగ్ : 2.75/5

నటీనటులు : మోహన్‌లాల్, మీనా, సిద్ధిక్, ఆశా శరత్, మురళీ గోపీ, అన్సిబా హాసన్, ఎస్తేర్ అనిల్ తదితరులు
దర్శకుడు : జీతూ జోసెఫ్
నిర్మాత : ఆంటోని పెరుంబవూర్
సంగీతం : అనిల్ జాన్సన్
ఛాయాగ్రహణం : సతీష్ కురుప్
కూర్పు : వినాయక్ విఎస్

సంబంధిత లింక్స్ : ట్రైలర్

ఇండియన్ సినిమా దగ్గర వచ్చిన పలు ఫైనెస్ట్ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాల్లో మలయాళ సినిమా నుంచి వచ్చిన “దృశ్యం” కూడా ఒకటి. దీని నుంచి ఆడియెన్స్ ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న అవైటెడ్ పార్ట్ 3 ఇప్పుడు ఎట్టకేలకి మలయాళం సహా తెలుగులో కూడా విడుదల అయ్యింది. మరి మోహన్ లాల్ ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టారా లేదా అనేది ఇప్పుడు సమీక్షలో చూద్దాం రండి.

కథ:

జార్జ్ కుట్టి (మోహన్ లాల్) ఎప్పుడు నుంచో కోరుకుంటున్న సినిమాని అక్కడి సూపర్ స్టార్ అరుణ్ కుమార్ (బిజూ మీనన్) తో చేసి ఒక బ్లాక్ బస్టర్ సక్సెస్ ని నిర్మాతగా అందుకుంటాడు. అయితే ఈ సక్సెస్ లో ఫేమ్ తో పాటుగా మీడియా నుంచి జార్జ్ కుట్టి కుటుంబంపై మరోసారి అటెన్షన్ పడుతుంది. ఈ క్రమంలోనే మళ్ళీ వరుణ్ (రోషన్ బషీర్) మరణంపై మళ్ళీ ఆరా మొదలవుతుంది. ఇంకోపక్క జార్జ్ కుట్టి తన కూతురు అను జార్జ్ (అన్పిబ హాసన్) పెళ్లిని కూడా ప్లాన్ చేసుకుంటాడు. ఇంకోపక్క జార్జ్ కదలికలు ఓ ఇద్దరు జర్నలిస్టులు కూడా గమనిస్తూ ఉంటారు. మరి ఈ క్రమంలో ఎదురైన నూతన సవాళ్లు ఏంటి? వాటిని ఈసారి జార్జ్ ఎలా అధిగమించాడు అనేవి తెలియాలి అంటే ఈ సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్లస్ పాయింట్స్:

మోహన్ లాల్ ఎలాంటి నటుడు అనేది మన తెలుగు ఆడియెన్స్ కి కూడా తెలుసు. ఎలాంటి పాత్రలో అయినా సరే పాదరసంలా ఇమిడిపోయే తాను దృశ్యం 3 లో కూడా తన మార్క్ పెర్ఫామెన్స్ ని అందించారు. అయితే ఇది తెలుగు ఆడియెన్స్ కి కొంచెం కొత్తగా అనిపించవచ్చు కానీ తన రోల్ లో మాత్రం మోహన్ లాల్ చాలా ఈజ్ గా తనదైన శైలి బాడీ లాంగ్వేజ్ తో రక్తి కట్టించారు.

అలాగే సినిమాలో సెకండాఫ్ నడిచిన తీరు ఒకింత ఓకే అని చెప్పొచ్చు. అక్కడక్కడా కొన్ని ఇంట్రెస్టింగ్ సీక్వెన్స్ లు మంచి ఆసక్తిగా నెలకొల్పుతాయి. అలాగే మోహన్ లాల్ కి పోలీసులకి నడుమ ఒక సంక్లిస్టమైన పరిస్థితిని దర్శకుడు మంచి మూమెంటం మైంటైన్ చేస్తూ తీసుకెళ్లడం బాగుంది. అలాగే ఇతర నటీనటులు కూడా సినిమాలో బాగా చేశారు. యంగ్ నటి ఎస్తర్ అనీల్ తో కొన్ని కామెడీ సీన్స్ బాగున్నాయి.

మైనస్ పాయింట్స్:

మలయాళ సినిమా థ్రిల్లర్స్ అండ్ మార్కెట్ ని పెంచిన చిత్రాల్లో దృశ్యం ఫ్రాంచైజ్ ది చాలా కీలక పాత్ర. అలాంటి ఫ్రాంచైజ్ నుంచి మూడో ఇన్స్టాల్మెంట్ అంటే అందరిలో మరింత హైప్ సెట్ అవుతుంది. పార్ట్ 1 నే ఆడియెన్స్ కి ఓ రేంజ్ థ్రిల్ అనుకుంటే పార్ట్ 2 ని దర్శకుడు ఇంకా ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించి రక్తి కట్టించారు.

సో వాటితో బిల్డ్ అయ్యిన హైప్ ని మాత్రం పార్ట్ 3 అందుకోలేకపోవడం అనేది ఒకింత డిజప్పాయింట్ చేస్తుంది. వాటి స్టాండర్డ్స్ కి తగ్గ రేంజ్ లో పార్ట్ 3 అయితే నడవలేదు. ఫస్టాఫ్ లో సినిమా పెద్దగా ఏమి లేదు, స్లో కథనంతో సాగుతుంది.

అలాగే సెకండాఫ్ తో అయినా సినిమా పూర్తిగా ఎగ్జైటింగ్ గా మంచి టర్న్ లు ట్విస్ట్ లతో సాగుతుందా అంటే అక్కడక్కడా ఏవో కొన్ని సీన్స్ ఆకట్టుకుంటాయి తప్పితే ఫుల్ ఫ్లెడ్జ్ గా ఈ థ్రిల్లర్ మెప్పించలేక స్ట్రగుల్ అవుతుంది. అలానే సినిమాలో జార్జ్ కుట్టి మైండ్ గేమ్ ఎలా ఉంటుంది అనేది కూడా ఆడియెన్స్ కి ఒక ఐడియా ఉంది. కానీ వాటిని మ్యాచ్ చేసే రీతిలో పార్ట్ 3 లో సీన్స్ గాని కథనం కానీ కొనసాగలేదు.

సాంకేతిక వర్గం:

ఈ సినిమాలో నిర్మాణ విలువలు డీసెంట్ గా ఉన్నాయి. అలాగే తెలుగు డబ్బింగ్ కూడా నీట్ గా ఉంది. అనీల్ జాన్సన్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో బాగుంది. అలానే సతీష్ కురుప్ ఇచ్చిన కెమెరా వర్క్ నాచురల్ టోన్ లో సినిమాకి బలం చేకూర్చింది. అయితే ఎడిటింగ్ ఇంకా బాగా ప్లాన్ చేయాల్సింది. ముఖ్యంగా ఫస్టాఫ్ లో.

ఇక దర్శకుడు జీతూ జోసెఫ్ విషయానికి వస్తే ఈ పర్టిక్యులర్ సినిమా విషయంలో ఏర్పడిన అంచనాలను వారు మ్యాచ్ చేయడంలో కొంచెం వెనుకబడ్డారు అనే చెప్పక తప్పదు. సాలిడ్ ట్విస్ట్ లు టర్న్ లు తన నుంచి ఆశిస్తే ఒక కేవలం కొన్ని చోట్ల వరకు తన వర్క్ తో మెప్పించారు కానీ పూర్తి సినిమాని తన గత రెండు సినిమాల రేంజ్ లో తెరకెక్కించే ప్రయత్నం మిస్ ఫైర్ అయినట్టు అనిపిస్తుంది.

తీర్పు:

ఇక మొత్తంగా చూసినట్టు అయితే ‘దృశ్యం 3’ ఈ ఫ్రాంచైజీ సెట్ చేసిన ఒక బార్ కి తగ్గ రేంజ్ లో అయితే అనిపించలేదు. అలా అని పార్ట్ 3 పూర్తిగా బాగోలేదా అంటే అక్కడక్కడా ఓకే అనిపిస్తుంది కానీ ఒక స్టాండర్డ్స్ సెట్ చేసిన ఫ్రాంచైజ్ కాబట్టి ఎవరైనా అంతకు మించే ఆశిస్తారు. కానీ ఇందులో ఆ ఎలిమెంట్ మిస్ అయ్యింది. సో పార్ట్ 3 ఇంపాక్ట్ ముందు సినిమాలతో పోలిస్తే తక్కువే ఉంటుంది. మోహన్ లాల్ ఎప్పటిలానే తన సిన్సియర్ పెర్ఫామెన్స్ ని అందించారు. కానీ మరింత ఎంగేజింగ్ కథనం మిస్ కావడంతో ఇది మిస్ ఫైర్ అయ్యింది.

123telugu.com Rating: 2.75/5

Reviewed by 123telugu Team

Exit mobile version