‘మెగాస్టార్’ కోసం డబ్బింగ్ చెప్పిన ‘సూపర్ స్టార్’ !

Published on Aug 18, 2019 11:53 am IST

మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా విడుదల కానున్న సంగతి తెలిసిందే. కాగా ‘సైరా’ టీజర్ కి పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ చెప్పారు. సైరాలో చిరంజీవి పాత్ర అద్భుతంగా ఎలివేట్ అయ్యేలా పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఉంటుందట. కాగా ‘సైరా’ తెలుగు వర్షన్ కి పవన్ డబ్బింగ్ చెప్పినట్లుగానే.. సైరా మలయాళ వర్షన్ కి సూపర్ స్టార్ మోహన్ లాల్ డబ్బింగ్ చెప్పారట. మోహన్ లాల్ ‘సైరా’ టీజర్ తో పాటు మూవీకి కూడా డబ్బింగ్ చెప్పారు. ఇక ఈ నెల 20న సైరా టీజర్ ని విడుదల కానుంది.

కాగా సైరా టీమ్ భారీ ఎత్తున ప్రచార ప్రణాళికలను రూపొందిస్తున్నారు. అలాగే ఈ చిత్రం ట్రైలర్ కోసం అభిమానాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీగా ఉన్న ఈ చిత్రం.. ఆగష్టు మూడో వారం కల్లా పోస్ట్ ప్రొడక్షన్ ను పూర్తి చేసుకోనుంది. ఈ సినిమాలో సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు.

ఇక ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగుతో పాటు తమిళం, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.

సంబంధిత సమాచారం :