తనపై వస్తున్న ఆ రూమర్స్ ని కొట్టిపారేసిన మోహన్ బాబు.

తనపై వస్తున్న ఆ రూమర్స్ ని కొట్టిపారేసిన మోహన్ బాబు.

Published on Jun 5, 2019 11:12 AM IST

విలక్షణ నటుడు,విద్యావేత్త కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు కొన్ని నెలల ముందు జగన్ కి మద్దతుగా వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి,ప్రచారం లో పాల్గొనడం వంటి కీలక వవ్యహారాలలో జగన్ కి మద్దతుగా నిలిచారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో కొలువుదీరింది. సాధారణంగా మనము ఏదైనా పార్టీకి చేస్తే పార్టీ తిరిగి మనకు ఏమైనా చేయాలనే పాలసీ తో రాజకీయాలు నడుస్తాయి. ఐతే దీనికి నేను భిన్నం అంటున్నారు మోహన్ బాబు.

టీటీడీ చైర్మన్ పదవిని ఆశిస్తున్నవారి లిస్టులో నేను ఉన్నానని వస్తున్న పుకార్లలో నిజం లేదన్నారు. నేను జగన్ ముఖ్యమంత్రి కావాలనే లక్ష్యంతో నావంతు ప్రయత్నం నేను చేశాను అన్నారు. జగన్ ప్రజల సీఎం గా ప్రజాపాలన చేస్తారనే నమ్మకంతో ఆయనకు మద్దతుగా రాజకీయాలలోకి తిరిగి వచ్చానే కానీ ఎటువంటి పదవుల కోసం కాదని అన్నారు. అలాగే ఇలాంటి పుకార్లను దయచేసి రాయవద్దని మీడియాను ట్విట్టర్ వేదికగా అభ్యర్ధించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు