వైసీపీలో చేరిన సీనియర్ హీరో !

Published on Mar 26, 2019 9:45 pm IST

ముందు నుంచి అనుకుంటున్నట్లుగానే సీనియర్ హీరో మంచు మోహన్‌ బాబు ఎట్టకేలకూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. తన పెద్ద కుమారుడు హీరో మంచు విష్ణుతో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నివాసానికి చేరుకుని.. కొంత సమయం జగన్ సమావేశమయ్యారు. ఆ సమావేశం అనంతరం వైఎస్‌ జగన్‌, మోహన్‌ బాబుకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

కాగా ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌ సీపీ నాయకులు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌ తదితరులు పాల్గొన్నారు. మరి మోహన్ బాబు వైసీపీ తరుపున ప్రచారానికే పరిమితమవ్వుతారా ? లేక భవిష్యుత్తులో ఆయన ఏదైన పదవిని దక్కించుకుంటారా అనేది చూడాలి.

సంబంధిత సమాచారం :

More