ఏనుగు దంతాల పై మోహన్ లాల్ క్లారిటీ.. అసలు విషయం ఇదే !

ఏనుగు దంతాల పై మోహన్ లాల్ క్లారిటీ.. అసలు విషయం ఇదే !

Published on Jul 6, 2026 4:42 PM IST

mohanlal

మలయాళ సూపర్ స్టార్ మోహన్‌ లాల్‌ దగ్గర ఏనుగు దంతాలు ఉన్నాయని వార్తలు రావడం, దీంతో ఆయన ఈ వివాదంలో చిక్కుకున్నారు. మొత్తానికి వన్యప్రాణుల కొమ్ములు, దంతాలతో తయారుచేసిన వస్తువులను అక్రమంగా కలిగి ఉన్నారనే ఆరోపణల కారణంగా మోహన్ లాల్ పై కేసు కూడా నమోదు అయింది. ఐతే, తన వద్ద 10 ఏనుగు దంతాలు, 13 ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు ఉన్నాయని మోహన్ లాల్ క్లారిటీ ఇచ్చారు. నిజానికి మోహన్‌ లాల్‌ గతంలో తన వద్ద 4 ఏనుగు దంతాలు ఉన్నాయని చెప్పారు.

తాజాగా ఇప్పుడు మరో 6 దంతాలు కూడా ఉన్నాయనే విషయాన్ని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది. అదేవిధంగా ఏనుగు దంతాలతో చేసిన 13 విగ్రహాలు కూడా తన దగ్గర ఉన్నాయని ఆయన తెలిపారు. కేరళ అటవీ శాఖ ఇచ్చిన క్షమాభిక్ష పథకంలో భాగంగా మోహన్‌ లాల్‌ తాజాగా ప్రకటన చేసినట్లు టాక్ నడుస్తోంది. ఐతే, తన వద్ద ఉన్న దంతాలు, విగ్రహాలలో చాలా వరకు తనకు వారసత్వంగా వచ్చాయని, అలాగే కొన్ని గిఫ్ట్స్ గా వచ్చాయని మోహన్‌ లాల్ తెలిపారు. ఇక ఆయన దగ్గర ఉన్న విగ్రహాలకు అటవీ శాఖ డీఎన్ఏ (DNA) పరీక్షలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

తాజా వార్తలు