సాలిడ్ థ్రిల్లర్ చిత్రాలకు మలయాళ సినిమా పెట్టింది పేరు. ఒకదాన్ని మించి ఒక ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ తో వారు ఆడియెన్స్ ని ఎంగేజ్ చేస్తూ ఉంటారు. అలా మలయాళ సినిమా నుంచి వచ్చిన ఓ ట్రెండ్ సెట్టింగ్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే దృశ్యం. మోహన్ లాల్ హీరోగా దర్శకుడు జీతూ జోసెఫ్ తెరకెక్కించిన ఈ సినిమాకి మూడో భాగం కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు.
అయితే ఫైనల్ గా పార్ట్ 3 ని ఈ ఏప్రిల్ 3 కి ప్లాన్ చేశారు కానీ గల్ఫ్ దేశాల్లో పరిస్థితిలు బాగోని కారణంగా వాయిదా పడవచ్చు అనే టాక్ నే వినిపించింది. అయితే దీనికి ముందు పార్ట్ 2 ని రీ రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. పార్ట్ 2 అప్పట్లో నేరుగా ఓటీటీ లోనే ఈ సినిమా విడుదల అయ్యింది. కానీ ఫైనల్ గా ఈ ఏప్రిల్ 10న ఈ సినిమా థియేటర్స్ లో రానున్నట్లు మేకర్స్ సరికొత్త పోస్టర్ తో ప్రకటించారు. ఈ సినిమాకి అనీల్ జాన్సన్ సంగీతం అందించారు. అలాగే ఆంటోనీ పేరంబవూర్ నిర్మాణం వహించారు.
Drishyam 2, returns to where it truly belongs.
In theatres from April 10th, 2026.#Drishyam2 @aashirvadcine @antonypbvr pic.twitter.com/cBGsLEPC1D
— Mohanlal (@Mohanlal) March 25, 2026


