తన హిస్టారికల్ చిత్రంపై క్లారిటీ ఇచ్చిన మోహన్ లాల్.!

Published on Jun 18, 2021 12:00 pm IST

మోలీవుడ్ సినీ సామ్రాజ్యాన్ని ఏలుతున్న లెజెండరీ హీరో మోహన్ లాల్ నటిస్తున్న భారీ ఎపిక్ పాన్ ఇండియన్ చిత్రం “మరక్కార్”. అరేబియన్ సముద్రానికి లయన్ గా పిలవబడే మరక్కర్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై మళయాళ ప్రేక్షకులు అయితే ఎన్నో అంచనాలు పెట్టుకొని చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

మోహన్ లాల్ నుంచి వస్తున్న భారీ హిస్టారికల్ చిత్రం కావడంతో అక్కడ ఖచ్చితంగా భారీ రికార్డులను సెట్ చేస్తుంది అనే టాక్ కూడా గట్టిగా ఉంది. కానీ గత కొంత కాలంగా పరిస్థితులు ఏమాత్రం అనుకూలంగా ఉండకపోవడంతో ఈ సినిమా విడుదల ఆన్ టైం వస్తుందా లేదా అని అభిమానులు కూడా భావిస్తున్న తరుణంలో మెహన్ లాల్ నే క్లారిటీ ఇచ్చేసారు.

వచ్చే ఆగష్టు 12 కే తమ ఈ భారీ చిత్రాన్ని విడుదల చెయ్యాలనే ఎట్టి పరిస్థితుల్లో అనుకుంటున్నామని మీ అందరి ప్రార్ధనలు మరియు సపోర్ట్ తోనే అది సాధ్యం కావాలని కోరుకుంటున్నట్టుగా మోహన్ లాల్ తన ఎపిక్ సినిమాపై క్లారిటీ ఇచ్చేసారు. మరి ఈ చిత్రంలో కీర్తీ సురేష్, కళ్యాణి ప్రియదర్శన్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తుండగా ప్రియదర్శన్ దర్శకత్వం వహించారు.

సంబంధిత సమాచారం :