మోహన్ లాల్ కూడా కరొనాకి భయపడ్డాడా?

మోహన్ లాల్ కూడా కరొనాకి భయపడ్డాడా?

Published on Jan 3, 2021 6:01 PM IST

mohanlal

ఎన్ని రోజులు గడిచినా కరోనా భయం మాత్రం అటు నిర్మాతలలో… ఇటు ప్రేక్షకులలో… అలాగే ఉండిపోయింది. థియేటర్ లో సినిమాని రిలీజ్ చెయ్యటానికి దర్శక నిర్మాతలు ఎలా భయపడుతున్నారో ప్రేక్షకులు కూడా థియేటర్ కి వచ్చే సాహసం చేయటానికి వెనకడుగు వేస్తున్నారు. ఎంతో ధైర్యం చేసి క్రిస్మస్ కానుకగా రిలీజ్ అయిన సోలో బ్రతుకే సో బెటర్ మూవీకి మంచి టాక్ తెచ్చుకుంది. ఇక సంక్రాంతికి కూడా చాలా సినిమాలు పోటీలో ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా ముందుగానే OTT ఒప్పందం చేసుకొని థియేటర్లలోకి విడుదల అవుతున్నాయి.

తాజాగా మోహన్ లాల్ ఇండస్ట్రీ హిట్ దృశ్యం సీక్వెల్ ‘దృశ్యం 2’ కూడా ఓటిటీలోనే విడుదలవుతుందని ప్రకటించారు. సాధారణంగా మోహన్ లాల్ వంటి సూపర్ స్టార్ సినిమా థియేటర్లలో విడుదల అయితే కచ్చితంగా ప్రేక్షకులు చూస్తారు. మంచి ఓపెనింగ్స్ కూడా వస్తాయి. అయినా కూడా దర్శక నిర్మాతలలో నమ్మకం కనిపించడం లేదు. అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ సినిమాను భారీ రేటు పెట్టి సొంతం చేసుకుంది. మలయాళంతో పాటు తెలుగు తమిళ వెర్షన్ కూడా ఇక్కడ విడుదలవుతుంది. సంక్రాంతి సీజన్లో జనవరి 13న మాస్టర్.. 14న రవితేజ క్రాక్.. రామ్ రెడ్ సినిమాలు వస్తున్నాయి. ఆ మరుసటి రోజు జనవరి 15న అల్లుడు అదుర్స్ అంటూ బెల్లంకొండ శ్రీనివాస్ వస్తున్నాడు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు