కాప్పాన్ షూటింగ్ పూర్తి చేసిన మలయాళ స్టార్ హీరో !

కాప్పాన్ షూటింగ్ పూర్తి చేసిన మలయాళ స్టార్ హీరో !

Published on Feb 21, 2019 8:45 PM IST

తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న ‘కాప్పాన్’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. రంగం’ ఫేమ్ కెవి ఆనంద్ తెరకెక్కిస్తున్నఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ ప్రధాన మంత్రి పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఆయన పాత్ర తాలూకు షూటింగ్ ను కంప్లీట్ అయ్యింది. కాగా సూర్య ఈ చిత్రంలో ఎన్ ఎస్ జి కమాండర్ గా కనిపించనున్నాడు. వాటికీ సంబందించిన పిక్స్ లీకై సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బోమన్ ఇరానీ , ఆర్య , చిరాగ్ జానీ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది. హారిస్ జైరాజ్ సంగీతం అందిస్తున్ ఈ చిత్రాన్ని ఆగస్టు 15న విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ఇక సూర్య నటించిన ‘ఎన్ జి కె’ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. సమ్మర్లో ఈ చిత్రం విడుదలకానుంది. సో ఈ ఏడాది రెండు సినిమాలతో ఫ్యాన్స్ ను థ్రిల్ చేయనున్నాడు సూర్య.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు