తెలుగులోకి డబ్ కాబోతున్న మరో సూపర్ స్టార్ సినిమా !

తెలుగులోకి డబ్ కాబోతున్న మరో సూపర్ స్టార్ సినిమా !

Published on Nov 4, 2018 8:10 PM IST

mohanlal
ఎన్టీఆర్ ‘జనతా గ్యారేజీ’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మాలీవుడ్ సూపర్ స్టార్ ‘మోహ‌న్ లాల్‌’ తెలుగులో కూడా తన మార్కెట్ ను పెంచుకున్నే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే తన సినిమాల్ని తెలుగులోకి అనువదించి విడుదల చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఇప్పటికే మోహన్ లాల్ నటించిన పలు చిత్రాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.

కాగా మోహన్ లాల్ తాజా చిత్రం ‘ఒడియన్’. ఈ చిత్రం ఒరిజినల్ వెర్షన్ డిసెంబర్ 14న విడుదల అవ్వనుంది. అయితే అదే రోజు తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేయాలని చిత్రబృందానికి మోహన్ లాల్ సూచించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే దగ్గుబాటి క్రియేషన్స్ ఈ సినిమా హక్కుల్ని సొంతం చేసుకుంది.

ఈ చిత్రానికి శ్రీకుమార్ మీనన్ దర్శకత్వం వహించగా సూపర్ పవర్స్ కలిగిన పాత్రలో మోహన్ లాల్ నటించారు.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు