సమీక్ష : వృషభ – బోరింగ్‌గా సాగే రొటీన్ ఫాంటసీ డ్రామా

సమీక్ష : వృషభ – బోరింగ్‌గా సాగే రొటీన్ ఫాంటసీ డ్రామా

Published on Dec 26, 2025 1:02 AM IST

Vrushabha

విడుదల తేదీ : డిసెంబర్ 25, 2025

123తెలుగు.కామ్ రేటింగ్ : 1.75/5

నటీనటులు : మోహన్‌లాల్, సమర్జిత్ లంకేశ్, నయన్ సారిక, రాగిని ద్వివేది, అజయ్, నేహా సక్సెనా, వినయ్ వర్మ తదితరులు
దర్శకుడు : నంద కిషోర్
నిర్మాతలు : శోభ కపూర్, ఏక్తా కపూర్
సంగీత దర్శకుడు : సామ్ సిఎస్
సినిమాటోగ్రాఫర్ : ఆంటోని సామ్సన్
ఎడిటర్ : కె.ఎం.ప్రకాష్

సంబంధిత లింక్స్ :  ట్రైలర్ 

మలయాళ స్టార్ హీరో మోహన్ లాల్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘వృషభ’ మలయాళంతో పాటు తెలుగులోనూ తెరకెక్కించారు. ఈ సినిమా నేడు థియేటర్లలో రిలీజ్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ :

త్రిలింగ రాజ్యం మహారాజు విజయేంద్ర వృషభ(మోహన్ లాల్) ఆత్మ లింగాన్ని రక్షిస్తుంటారు. ఒకరోజు శత్రువులు ఆ ఆత్మ లింగాన్ని దక్కించుకునేందుకు దండెత్తి వస్తారు. దీంతో తన మనుష్యులతో కలిసి విజయేంద్ర వృషభ వారిని ప్రతిఘటిస్తారు. ఈ క్రమంలో విజయేంద్ర వృషభ అనుకోకుండా ఓ చిన్నారిని హతమారుస్తాడు. ఆ చిన్నారి తల్లి విజయేంద్రను శపిస్తుంది. ఆ శాపం అతడిని మరుజన్మలో కూడా వెంటాడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమా కథ.

ప్లస్ పాయింట్స్ :

వృషభ చిత్రంలో ఎమోషన్స్ సరికొత్తగా ఉన్నాయి. దీని కారణంగానే మోహన్ లాల్ ఈ సినిమాలో నటించేందుకు అంగీకరించారు. అయితే, ఈ సినిమాకు ఇది మాత్రమే ప్లస్ పాయింట్‌గా మిగిలింది.

సెకండాఫ్‌లో మోహన్ లాల్ మరో కీలక పాత్ర మధ్య వచ్చే కత్తిసాము డీసెంట్‌గా ఉంటుంది. అయితే, ఇది కొద్ది సేపటి వరకే ప్రేక్షకులకు గుర్తుండిపోతుంది.

మైనస్ పాయింట్స్ :

వృషభ చిత్రానికి సంబంధించిన ఐడియా బాగుంది. ఓ మంచి పునఃర్జన్మ చిత్రంగా ఈ మూవీని మలిచే అవకాశం ఉంది. కానీ, కేవలం ఐడియా బాగుంటే సరిపోదు. సినిమాను అన్ని అంశాల్లో కరెక్ట్‌గా తెరకెక్కిస్తేనే అది బాగా కుదురుతుంది. ఈ సినిమా విషయంలోనూ అదే జరిగింది.

మోహన్ లాల్ లాంటి నటుడిని డీల్ చేయాలంటే కథలో చాలా దమ్ముండాలి. కానీ, ఈ మూవీ రైటింగ్ చాలా వీక్‌గా ఉండటంతో స్క్రీన్ ప్లే చాలా అస్తవ్యస్తంగా సాగుతుంది. స్క్రిప్ట్, స్క్రీన్ ప్లే, దర్శకత్వం పూర్తిగా ఫెయిల్ కావడంతో నటీనటుల పర్ఫార్మెన్స్ ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాయి.

2 గంటల 7 నిమిషాల తక్కువ రన్‌టైమ్ ఉన్నప్పటికీ వృషభ చిత్ర కథనం ప్రేక్షకులకు చికాకు తెప్పిస్తుంది. ఏమాత్రం ఆకట్టుకోని ఏఐ విజువల్స్, చప్పగా సాగే డైలాగులు, అనవసరమైన లవ్ ట్రాక్ ప్రేక్షకులకు బోర్ కొట్టిస్తాయి. జీతేంద్ర క్యామిలో కూడా ఏమాత్రం మెప్పించదు.

సమర్జిత్, నయన్ సారిక పాత్రలు ఏమాత్రం మెప్పించవు. మిగతా వారికి కనీస గుర్తింపు ఉన్న పాత్రలు కూడా దక్కవు. కేవలం ఏఐ విజువల్స్‌ను నమ్ముకుని ఇలాంటి సినిమాతో హిట్ కొట్టాలనే మేకర్స్ ఆశ ప్రేక్షకులను తీవ్రంగా నిరాశపరిచింది.

సాంకేతిక విభాగం :

వృషభ లాంటి సబ్జెక్ట్‌కు చాలా సాంకేతిక పనితనం అవసరం ఉంటుంది. మోహన్ లాల్ ఇంట్రొడక్షన్ ఎపిసోడ్‌లో వచ్చే గుర్రపు స్వారీ సీక్వెన్స్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందో ప్రేక్షకులు అర్థమవుతుంది. కానీ, సినిమా సాగుతున్న కొద్ది సాంకేతికంగా ఏమాత్రం ఆకట్టుకునే అంశాలు కనిపించవు. సంగీతం, సినిమాటోగ్రఫీ కొన్ని సీన్స్‌లో పర్వాలేదనిస్తాయి. దర్శకుడు నందకిషోర్ వర్క్ పూర్తిగా ఫెయిల్ అయిందని చెప్పాలి.

తీర్పు :

ఓవరాల్‌గా చూస్తే.. ‘వృషభ’ ప్రేక్షకులను ఏమాత్రం ఆకట్టుకోని చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలోని కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, ఏఐ విజువల్స్ ప్రేక్షకులను మెప్పించవు. సినిమా కోర్ పాయింట్, సెకండాఫ్‌లోని కొన్ని సీన్స్ మినహా వృషభ చిత్రంలో చెప్పుకోవడానికి ఏమీ లేవు. మోహన్ లాల్ కూడా ఈ సినిమాను కాపాడలేకపోయారు. హాలీడే సీజన్‌ను ఎంజాయ్ చేయాలనుకునే వారు ఈ చిత్రాన్ని స్కిప్ చేయడం బెటర్.

123telugu.com Rating: 1.75/5

Reviewed by 123telugu Team 

సంబంధిత సమాచారం

తాజా వార్తలు