తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ‘ఈఎన్ఈ రిపీట్’ ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ రాబడుతుంది. నిన్నటి వరకు ఈ సినిమాకి వచ్చిన వసూళ్లు 32 కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. పైగా మొదటి వారాంతం ముగిసే సమయానికి మొత్తం వసూళ్లు సుమారు 43 కోట్ల రూపాయలకు చేరుకోవచ్చని అంచనా. ఐతే, నేడు సోమవారం నుంచి వచ్చే కలెక్షన్స్ ఇప్పుడు కీలకంగా మారింది. నేడు వర్కింగ్ డే కావడంతో కలెక్షన్లు తగ్గుతాయని భావిస్తున్నారు.
ఏది ఏమైనా ఈ రోజు నుంచి వచ్చే కలెక్షన్స్ ను బట్టి ఈ సినిమా సక్సెస్ రేంజ్ ఆధారపడుతుంది. ఈ సినిమాలో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, శ్రీనాథ్ మాగంటి, వెంకటేష్ కాకమాను, అనీషా ఆంబ్రోస్, శివాత్మిక రాజశేఖర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. సృజన్ యరబోలు మరియు సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించగా, వివేక్ సాగర్ సంగీతం అందించారు. మొత్తానికి సినిమా అయితే హిట్ అనిపించుకుంది.


