డబ్బింగ్ ఫినిష్ చేయనున్న మెగాస్టార్ ?

డబ్బింగ్ ఫినిష్ చేయనున్న మెగాస్టార్ ?

Published on Nov 23, 2026 7:01 AM IST

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబినేషన్‌లో ‘కాకా’ సినిమా రాబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి ఈ వారంలో డబ్బింగ్ కి సంబంధించి బ్యాలెన్స్ పార్ట్ ను పూర్తి చేయనున్నారు. ఇక డిసెంబర్ 1 నుంచి ‘కాకా’ ప్రమోషన్లను భారీ స్థాయిలో ప్రారంభించనున్నారు. ముందుగా పాటలు, ఆ తర్వాత టీజర్, ట్రైలర్‌తో ప్రచారాన్ని మరింత వేడెక్కించనున్నారు. ఇక ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా ఉంటాయని తెలుస్తోంది. స్టోరీ కూడా ప్రత్యేకంగా ఉంటుందట. చిరును కొత్తగా చూపించాలనే ఉద్దేశ్యంతో ఈ కథ రాసుకున్నారట బాబీ.

పైగా వాల్తేరు వీరయ్య’ తర్వాత వీరిద్దరి కలయికలో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈ సినిమాని KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మాతలు వెంకట్ కె నారాయణ, లోహిత్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. మొత్తానికి ‘కాకా’ టీమ్ సంక్రాంతి విడుదల లక్ష్యంతో ముందుకు వెళ్తోంది. జనవరి 13, 2027న సంక్రాంతి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించారు.

తాజా వార్తలు