టాలీవుడ్ లెజెండరీ హీరో మెగాస్టార్ చిరంజీవీ ప్రస్తుతం తెలుగులో తన మొదటి ఓటిటి ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసిందే. అది కూడా పాపులర్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లాంటి వారితో రావడం తన ఎంట్రీకి మరింత హుందాతనం తీసుకొచ్చింది. మెగాస్టార్ చేస్తున్న ఈ టాక్ షోకి ‘మెగావర్స్’ అనే టైటిల్ ని కూడా వారు లాక్ చేశారు.
అయితే స్ట్రీమింగ్ డేట్ కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో నెట్ ఫ్లిక్స్ ఈ నవంబర్ ఎండింగ్ లో ఓ గ్రాండ్ ఈవెంట్ ని ఆర్గనైజ్ చేయడం ఖాయం అయ్యింది. ఈ నేపథ్యంలో ఆల్రెడీ ఆఫ్ లైన్ ప్రమోషన్స్ లో మెగాస్టార్ షోపై పలు హోర్డింగ్స్ కూడా వైరల్ గా మారాయి. కానీ వీటిలో చిరంజీవి అనే ఇంగ్లీష్ వెర్షన్ పేరులో N అనే అక్షరం మిస్ చేయడం ఫ్యాన్స్ లో టాపిక్ గా మారింది.
అయితే ఇది షోకి సంబంధించిందా లేక మెగాస్టార్ పేరులో ఏమన్నా మార్పు చేసారా? లేకపోతే నెట్ ఫ్లిక్స్ వారి లోగో సింబల్ ని హైలైట్ చేసి వదులుతారా అనేది పెద్ద సస్పెన్స్ గా మారింది. దీనితో తన పేరు కూడా ఇప్పుడు మంచి ఆసక్తిని రేకెత్తిస్తుంది. దీనిపై త్వరలోనే ఓ క్లారిటీ రావచ్చు.



