మరింత ఆసక్తి రేపుతున్న “మనీ హేస్ట్5” లేటెస్ట్ ట్రైలర్..!

Published on Nov 4, 2021 9:02 am IST


ప్రపంచంలో అతిపెద్ద స్ట్రీమింగ్ ప్లాట్ ఫామ్ ఏదన్నా ఉంది అంటే అది దిగ్గజ స్ట్రీమింగ్ యాప్ నెట్ ఫ్లిక్స్ అని అందరికీ తెలిసిందే. మరి అందులో గ్లోబల్ గా హిట్టయిన ఆల్ టైం కొన్ని షోస్ లో మనీ హేస్ట్ కూడా ఒకటి. స్పానిష్ కి చెందిన ఈ ఇంటెలిజెన్స్ రాబెరీ సిరీస్ చివరి సీసన్ చివరి భాగానికి వచ్చేసింది.

వచ్చే డిసెంబర్ లో స్ట్రీమింగ్ కి రెడీగా ఉన్న ఈ భాగం ట్రైలర్ ని రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వారు రిలీజ్ చెయ్యగా అది మరింత ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా ఇందులో ప్రొఫెసర్ వచ్చి పోలీస్ కి లొంగిపోవడం అనేది షో వీక్షకులను ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ స్టెప్ తో ప్రొఫెసర్ అండ్ టీం తమ ఓటమిని ఒప్పుకున్నట్టా లేక దీంట్లో కూడా ఏమన్నా ప్లాన్ ఉందా అనేది చూడాల్సిందే. ఇవన్నీ తెలియాలి అంటే ఈ సిరీస్ ని వచ్చే డిసెంబర్ 3న రిలీస్ వరకు ఆగాల్సిందే.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

More