“మనీ హెయిస్ట్ 5”..ఎఫెక్ట్..మామూలుగా లేదుగా!

Published on Sep 1, 2021 3:43 pm IST

ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఓటిటి వీక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ వెబ్ సిరీస్ “మనీ హెయిస్ట్”. స్పానిష్ లో “లకాసా డి పాపెల్” గా స్టార్ట్ అయిన ఈ సెన్సేషనల్ సిరీస్ దిగ్గజ స్ట్రీమింగ్ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కి తన ఫైనల్ సీజన్ తో సిద్ధంగా ఉంది. మరి వరల్డ్ వైడ్ అంటే మన దేశంలో కూడా దీనికి అభిమానులు ఉన్నారు.

రేపటి నుంచి స్ట్రీమింగ్ కి రానున్న సిరీస్ ఎఫెక్ట్ ఎలా ఉంది అంటే మన దేశంలో పలు చోట్ల ఐటీ కంపెనీలకి ఈ స్ట్రీమింగ్ డేట్ కి తమ ఎంప్లాయిస్ కి సెలవలు ఇచ్చేస్తున్నారు. ఆల్రెడీ జైపూర్ లో ఓ ఐటీ కంపెనీ ఈ సిరీస్ రిలీజ్ సందర్భంగా అధికారికంగా సెలవు ప్రకటించేసారు.

ఇది వరకు అంటే సినిమాలకి సెలవులు చూసాం కానీ ఒక సిరీస్ రిలీజ్ సెలవు ప్రకటించడం బహుశా ఇదే మొదటి సారి ఏమో. మొత్తానికి మాత్రం ఈ సెన్సేషనల్ సిరీస్ ఎఫెక్ట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్ధం చేసుకోవచ్చు. మొత్తం రెండు భాగాలుగా ప్లాన్ చేసిన సీజన్ 5 లో ఒక్కో పార్ట్ కి 5 ఎపిసోడ్స్ ఉన్నాయి. దీనితో ఈ ఫేమస్ సిరీస్ కి ఎండ్ కార్డు పడనుంది.

సంబంధిత సమాచారం :