సరిలేరు నీకెవ్వరు.. ద్వితీయార్థంలోనే అసలు వినోదం

Published on Oct 1, 2019 4:34 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు కొత్త చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. మహేష్ తొలిసారి అవుట్ అండ్ అవుట్ ఎంటెర్టైనింగ్ సబ్జెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమా బోలెడంత ప్రత్యేకతను సంతరించుకుంది. మహేష్ పూర్తిస్థాయి యాక్షన్ హీరో కాబట్టి సినిమాలో ఫన్ కంటెంట్ మరీ ఎక్కువ ఉండకపోవచ్చనే అనుమానాలు మొదలయ్యాయి.

కానీ సినీ వర్గాల సమాచారం మేరకు సినిమాలో వినోదానికి ఎలాంటి ఢోకా ఉండదని తెలుస్తోంది. ముఖ్యంగా ద్వితీయార్థంలో వినోదం పుష్కలంగా దొరుకుతుందట. సో.. అనిల్ రావిపూడి అభిమానుల అంచనాలకు తగ్గట్టే సినిమాను తెరకెక్కిస్తున్నారన్నమాట. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ ముగించుకున్న ఈ సినిమాని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయనున్నారు.

అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న కథానాయకిగా నటిస్తుండగా తమన్నా ప్రత్యేక గీతంలో మెరవనుంది. అంతేకాదు అలనాటి స్టార్ నటి విజయశాంతి ఒక కీలక పాత్రలో నటించనున్నారు.

సంబంధిత సమాచారం :

More