రానున్న “RRR” రోర్ పై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం!

Published on Jul 15, 2021 10:00 am IST


ప్రస్తుతం మరోసారి పాన్ ఇండియన్ వైడ్ మూవీ లవర్స్ ఆసక్తిగా “RRR” మేకింగ్ వీడియో కోసం ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా మన తెలుగు ఆడియెన్స్ లో ఉన్న హైప్ అయితే మరో లెవెల్లో ఉంది. దర్శకుడు రాజమౌళి మరియు తారక్, చరణ్ ల కాంబోలో వస్తున్న ఈ బిగ్గెస్ట్ పాన్ ఇండియన్ చిత్రం నుంచి డిజైన్ చేసిన ఈ కొత్త మేకింగ్ వీడియో పై మేకర్స్ కూడా మరిన్ని అంచనాలు తీసుకొచ్చారు.

అయితే దీనిపై మరింత ఇంట్రెస్టింగ్ సమాచారం వినిపిస్తుంది. ఈ మేకింగ్ వీడియో రెండున్నర నిమిషాలకు పైగానే ఉంటుందట అలాగే ఇందులో ముఖ్యంగా లెజెండరీ సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మరో లెవెల్లో ఉంటుందని తెలుస్తుంది. దానిని సాలిడ్ సౌండ్ సిస్టం తో బిగ్ స్క్రీన్ పై చూస్తే కనుక అదిరే ఎక్స్ పీరియన్స్ వస్తుందని తెలుస్తుంది. మరి ఈ బిగ్గెస్ట్ మేకింగ్ ట్రీట్ ఎలా ఉంటుందో ఎంతటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :