“పుష్ప” పై మరింత ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Jun 24, 2021 10:59 am IST

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా క్రియేటివ్ దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “పుష్ప”. అంతకంతకు అంచనాలు పెంచుకుంటూ వెళ్తున్న ఈ చిత్రంపై ఒక్కొక్కటిగా ఆసక్తికర అంశాలే బయటకి వస్తున్నాయి. అలా లేటెస్ట్ గా మరిన్ని ఆసక్తికర అంశాలు తెలుస్తున్నాయి. ఈ చిత్రంలో బన్నీ రోల్ కంప్లీట్ డిఫరెంట్ గా ఉంటుందని తెలిసిందే.

కానీ మనం ఊహించని విధంగా రష్మికా తో పాటు గిరిజన ప్రాంత యువకుడిగా కనిపిస్తాడట. ముఖ్యంగా ఆ చిత్తూరు యాసలో మాట్లాడుతుంటే ఒక కొత్త బన్నీని ఈ సినిమా నుంచి చూసినట్టు ఉంటుందట. అలాగే కాస్త రంగస్థలం షేడ్స్ కూడా ఈ సినిమాలో ఉంటాయట.

అయితే రంగస్థలం బ్యాక్ డ్రాప్ పాతది కానీ ఈ చిత్రంలో చూపించే పాత్రల ప్రాంతాల ఆధారంగా ప్రతీ అంశం పీరియాడిక్ డ్రాప్ లో ఉన్నట్టు అనిపిస్తుందట. అంటే గిరిజన ప్రాంత బ్యాక్ డ్రాప్ కావడం మూలాన వారి అలవాట్లు జీవన శైలి ఆ తరహాలో చూపించనున్నట్టు తెలుస్తుంది. ఫైనల్ గా బన్నీ మాత్రం పుష్ప రాజ్ రోల్ లో సరికొత్త పెర్ఫామెన్స్ అదరగొట్టడం ఖాయం అని బలంగా వినిపిస్తుంది.

సంబంధిత సమాచారం :