తారక్, కొరటాల ప్రాజెక్ట్ పై మరో ఇంట్రెస్టింగ్ ఇన్ఫో.!

Published on Aug 28, 2021 2:59 pm IST


ఇప్పుడు టాలీవుడ్ ఇండస్ట్రీ వర్గాల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు బ్లాక్ బస్టర్ దర్శకుడు కొరటాల శివ కాంబోలో ప్లాన్ చేసిన రెండో సినిమా కోసమే హాట్ హాట్ టాపిక్ నడుస్తుంది. మరి ఇదిలా ఉండగా ఈ సెన్సేషనల్ కాంబో నుంచి మరిన్ని ఆసక్తికర అప్డేట్స్ వచ్చే సెప్టెంబర్ నెల నుంచి రానున్నాయి అని టాక్ నడుస్తుండగా ఈ సినిమాకి ఎంపిక కాబడిన సంగీత దర్శకుడు అనిరుద్ అని దానిపై అధికారిక క్లారిటీ కూడా రానుంది అని తెలిసింది.

మరి దీనిపై ఇంకా ఇంట్రెస్టింగ్ ఇన్ఫో వినిపిస్తుంది. మరి దాని ప్రకారం వచ్చే నెల నుంచి కొరటాల మరియు అనిరుద్ ల మధ్య ఈ చిత్రంపై మ్యూజికల్ సిట్టింగ్స్ ఉండనున్నాయట. ఆ తర్వాత నుంచి సినిమా టేకాఫ్ అవ్వనున్నట్టు సమాచారం. మరి దీనిపై మరింత సమాచారం రావాల్సి ఉంది. ఇక ఈ భారీ పాన్ ఇండియన్ చిత్రాన్ని యసుధ ఆర్ట్స్ మరియు నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పై హై బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :