రజినీ నుంచి మరిన్ని అదిరే ట్రీట్స్..లేటెస్ట్ అప్డేట్ ఇదే

Published on Oct 5, 2021 7:01 am IST

కోలీవుడ్ తలైవర్ సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నయనతార హీరోయిన్ గా బ్లాక్ బస్టర్ దర్శకుడు శివ తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “అన్నాత్తే”. రజినీ నుంచి చాలా కాలం తర్వాత వస్తున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి దీనితో పాటుగా నిన్న లెజెండరీ గాయకులు స్వర్గీయ ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఫస్ట్ సింగిల్ కి కూడా భారీ రెస్పాన్స్ ఇప్పుడు వస్తుంది.

అయితే ఈ చిత్రాన్ని మేకర్స్ దీపావళికి తీసుకొస్తుండగా మరిన్ని అదిరే ట్రీట్స్ ఈ సినిమా నుంచి ఉన్నాయని తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం అయితే ఈ సినిమా ట్రైలర్ కట్ కూడా ఆల్రెడీ రెడీ అయ్యిపోయిందట. అంతే కాకుండా ఈ ఆక్టోబర్ నెలలో ఈ సినిమా నుంచి మరిన్ని అప్డేట్స్ ఉండటం ఖాయం అని తెలుస్తోంది. దీనితో ఇక సినిమా రిలీజ్ అయ్యేంత వరకు తలైవర్ అభిమానులుకు పండగే అని చెప్పాలి.

సంబంధిత సమాచారం :