పవన్ భారీ ఆర్ధిక సాయానికి యంగ్ మెగా నటుల మరింత సాయం.!

Published on Jun 14, 2022 9:00 am IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం తన సినిమాలతో తన పాలిటిక్స్ లో కూడా బిజీగా ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. మరి ఇప్పుడు అయితే తన తన రాజకీయ పార్టీ కార్యాకలాపాల్లో బిజీగా ఉంటున్న పవన్ గత కొన్నాళ్ల కితం ఏపీలో తమ పార్టీ నుంచి కౌలు రైతులను ఆదుకునేందుకు తన కష్టార్జితం 30 కోట్లతో భారీ ఆర్ధిక సాయాన్ని అందించే భరోసా యాత్రని మొదలు పెట్టాడు.

అయితే ఇప్పుడు పవన్ తో పాటుగా పవన్ పార్టీ కోసం గాను తమ మెగా కుటుంబీకులు యంగ్ నటులు అంతా కలిపి భారీ మొత్తంలో 35 లక్షల రూపాయలు ప్రకటించినట్టు తెలుస్తుంది. అయితే వీరిలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 10 లక్షలు, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ 10 లక్షలు అలాగే నిహారిక మరియు పంజా వైష్ణవ్ తేజ్ లు ఐదేసి లక్షలు పవన్ ఇతర కుటుంబీకులు 5 లక్షలు విరాళంగా ఇచ్చినట్టు తెలిసింది. దీనితో మెగా ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :