ప్రస్తుతం కోలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ టాలెంటెడ్ దర్శకుల్లో లోకేష్ కనగరాజ్ కూడా ఒకరు. తనవి తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ ని తను సొంతం చేసుకున్నాడు. అయితే ఈ దర్శకుడుతో తమ హీరో సినిమా చేయాలని ప్రతీ స్టార్ హీరో అభిమాని కోరుకున్నాడు. ఇప్పుడు ఫైనల్ గా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో సినిమా లాక్ అయ్యి సెన్సేషన్ గా మారింది.
సరే ఇదంతా బాగానే ఉంది కానీ తమిళ ఆడియెన్స్ మాత్రం లోకేష్ పై విమర్శలు చేస్తున్నారు. లోకేష్ కనగరాజ్ కి ఇంత క్రేజ్ తెచ్చి పెట్టిందే తన ఖైదీ, సినిమాటిక్ యూనివర్స్ లు వల్ల. మెయిన్ గా ఖైదీ 2 కోసం ఎన్నో ఏళ్ళు నుంచి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు కానీ ఈ సినిమా మాత్రం తీయడం లేదు. దీనితో ఫ్యాన్స్ మాత్రం చాలా డిజప్పాయింట్ గా ఉన్నారు. మరి ఈ సినిమా లోకేష్ ఎందుకు మొదలు పెట్టడం లేదు అనేది తనకే తెలియాలి.


