నిజంగా ఎన్టీఆర్ అన్నకి చాలా పవర్ ఉంది – తమన్

Published on Sep 10, 2018 11:55 am IST

తెలుగుదేశం పార్టీ సినీయ‌ర్ నాయ‌కుడు నందమూరి హరికృష్ణగారి మరణం సినీ రాజకీయ రంగాలకి తీరని లోటు మిగిల్చింది. ముఖ్యంగా ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ లను తీవ్ర దిగ్ర్భాంతికి గురిచేసింది ఆ సంఘటన. అయినప్పటికీ, వృతి పట్ల అంకితభావంతో.. ఎన్టీఆర్, కల్యాణ్‌రామ్‌ లు ఇద్దరూ తమ తండ్రి లేరని బాధను దిగమింగుకుంటూనే, తమ సినిమాల షూటింగ్స్ లో పాల్గొంటున్న విషయం తెలిసిందే.

కాగా దసరాకి విడుదల చేయాలనే ఉద్దేశ్యంతో తెరకెక్కిస్తున్న చిత్రం ‘అరవింద సమేత’. త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా హీరోగా రూపొందుతున్న ఈ సినిమాకు సంబంధించి నిన్న ఓ పాటను చిత్రీకరించిందట చిత్రబృందం. ఆ పాటను షూట్ చేస్తున్న క్రమంలో ఎన్టీఆర్ చాలా ఎనర్జిటిక్ గా కనిపించారని ఈ చిత్ర సంగీత దర్శకుడు తమన్ తన ట్వీటర్ ద్వారా పేర్కొన్నారు.

థమన్ ఎన్టీఆర్ గురించి స్పందిస్తూ ‘తారక్ అన్న ఈ రోజు(ఆదివారం)తో చాలా ఎమోషనల్ గా సాంగ్ కోసం షూటింగ్‌ని స్టార్ట్ చేశారు. ఈ రోజు(ఆదివారం) ఆయన తన డ్యాన్స్‌ తో, మళ్లీ తన ఎనర్జీని వెనక్కి తెచ్చుకున్నట్టు అనిపించింది. నాకు చాలా మంచి ఫీల్ కలిగింది. నిజంగా మీకు చాలా పవర్ ఉంది అన్న. అరవింద సమేత చిత్రబృందం తరుపున, మీకు లాట్స్ ఆఫ్ లవ్. అదేవిధంగా ఇక నుండి ఆడియో అప్‌డేట్స్ ఈ వారంలో మొదలవుతాయి’ అని థమన్ పోస్ట్ చేశారు.

సంబంధిత సమాచారం :