‘కంచె’కి నేటి నుంచి పెరగనున్న స్క్రీన్స్

‘కంచె’కి నేటి నుంచి పెరగనున్న స్క్రీన్స్

Published on Oct 23, 2015 12:26 PM IST

kanche

ఒక సినిమాతో ఒకదానికి సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్న క్రిష్ డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా నటించిన సినిమా ‘కంచె’. దసరా కానుకగా నిన్న రిలీజ్ అయిన ఈ సినిమాకి విమర్శకుల నుంచి ప్రశంశలు వెల్లువెత్తు తున్నాయి. అలాగే సినిమా చూసిన ప్రతి తెలుగు ప్రేక్షకుడి నుంచి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తోంది. ఇరు రాష్ట్రాల్లోనూ బాక్స్ ఆఫీసు వద్ద ఈ సినిమా అక్సోం క్రేజ్ నెలకొనడం వలన డిస్ట్రిబ్యూటర్స్ ఎక్స్ట్రా స్క్రీన్స్ లో సినిమాని వెయ్యడానికి సిద్దమయ్యారు. నేటి నుంచి ఈ సినిమాకి ఇరు రాష్ట్రాల్లో స్క్రీన్స్ పెరగనున్నాయి.

అందరినీ అబ్బురపరిచే వరల్డ్ వార్ II సీన్స్, వరుణ్ తేజ్ పెర్ఫార్మన్స్, సాయి మాధవ్ బుర్రా రాసిన కదిలించే డైలాగ్స్, గ్రాండ్ ప్రొడక్షన్ వాల్యూస్ తో పాటు 1940 కంటెంట్ ని సూపర్బ్ గా ప్రెజంట్ చేసిన క్రిష్ పైన తెలుగు సినిమా అభిమానులు ప్రశంశలు కురిపిస్తున్నారు. మరోవైపు ట్రేడ్ వర్గాలు కూడా సినిమాకి పాజిటివ్ టాక్ వినిపిస్తుండడంతో సినిమా కచ్చితంగా బాక్స్ ఆఫీసు వద్ద లాభాలను కురిపిస్తుందని అంటున్నారు. అంతే కాకుండా తెలుగు ఆడియన్స్ కంచె లాంటి ఓ ట్రెండ్ సెట్టింగ్ మూవీని ఆదరిస్తుండడం తెలుగు సినిమాకి చాలా శుభ పరిణామం అని అంటున్నారు.

తాజా వార్తలు