“శక్తిమాన్” ఇష్యూ : రణ్వీర్ మౌనంతో మరింత సస్పెన్స్

“శక్తిమాన్” ఇష్యూ : రణ్వీర్ మౌనంతో మరింత సస్పెన్స్

Published on Mar 19, 2024 12:05 PM IST

ప్రపంచవ్యాప్తంగా సూపర్ హీరోస్ జానర్ కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. చిన్న పిల్లలు నుంచి పెద్దలు కూడా ఈ జానర్ సినిమాలని బాగా ఇష్టపడతారు. అయితే మన దేశం నుంచి కూడా ఒక సూపర్ హీరో అది కూడా మొట్ట మొదటి సూపర్ ఎవరైనా ఎంటర్టైన్ చేశారు అంటే అది “శక్తిమాన్” (ShaktiMaan) అని చెప్పాలి. అప్పట్లో టెలివిజన్ స్క్రీన్స్ పై వచ్చిన ఈ సూపర్ హీరో సిరీస్ భారీ ఎత్తున ప్రభావితం చేసింది.

దీనితో మన నుంచి సూపర్ హీరో అంటే శక్తిమాన్ అనే లెవెల్లో పాతుకుపోయిన ఈ పాత్ర.. దానికి హిందీ నటుడు ముఖేష్ ఖన్నా (Mukhesh Khanna) సంపూర్ణ న్యాయం చేశారు. మరి ఎన్నో ఏళ్ళు తర్వాత ఈ సూపర్ హీరోని ప్రపంచ సినిమాకి పరిచయం చేయడానికి సోనీ పిక్చర్స్ ఇండియా వారు పూనుకున్నారు.

అయితే ఈ సినిమాలో శక్తిమాన్ గా బాలీవుడ్ టాలెంటెడ్ హీరో రణ్వీర్ సింగ్ (Ranveer Singh) కనిపిస్తాడు అని స్ట్రాంగ్ బజ్ ఇప్పటికీ ఉంది. మరి దీనిపై ముఖేష్ ఖన్నా చేసిన లేటెస్ట్ పోస్ట్ అండ్ కామెంట్స్ సినీ వర్గాల్లో కాంట్రవర్సీగా మారాయి. తాను ఇలాంటి పాత్రకి రణ్వీర్ లాంటి నటుడు చేయడం ఏమాత్రం ఇష్టపడలేదు.

ఒంటి మీద బట్టలు లేకుండా ఫోటో షూట్ లు చేసుకునే హీరో ఈ పాత్ర చేయకూడదు అని రణ్వీర్ విషయంలో అసహనం వ్యక్తం చేస్తూ తన సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేశారు. అయితే అనూహ్యంగా దీనిని మళ్ళీ తొలగించడం ఆశ్చర్యంగా మారింది. ఇక మరో పక్క రణ్వీర్ ఈ ఇష్యూ పట్ల ఇంకా మౌనంగా ఉండడం ఈ సినిమా విషయంలో మరింత సస్పెన్స్ గా మారింది. మరి ఇంకా హీరోగా కన్ఫర్మ్ కాని రణ్వీర్ అయితే దీనిపై స్పందిస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు