ఆసక్తికరంగా అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఫస్ట్ లుక్

Published on Feb 8, 2020 6:05 pm IST

అక్కినేని హీరో అఖిల్ నాలుగవ చిత్రంగా తెరకెక్కుతుంది మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్. దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఈ చిత్రాన్ని యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిస్తున్నారు. ఇటీవల టైటిల్ లోగో విడుదల చేసిన చిత్ర యూనిట్ నేడు ఫస్ట్ లుక్ విడుదల చేశారు. విదేశీ వీధుల్లో నిట్ క్యాప్, మెడలో స్కార్ఫ్ ధరించి, పాదరక్షలు లేకుండా ఒట్టి కాళ్ళతో నడుచుకుంటూ వెళుతున్న అఖిల్ లుక్ ఆసక్తి రేపుతోంది.

జి2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ సినిమాతో అఖిల్ మంచి హిట్ అందుకోవడం ఖాయంగా కనిపిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం గోపీ సుందర్ అందిస్తున్నారు. ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :