టాప్ లో ట్రెండ్ అవుతోన్న మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ట్రైలర్!

Published on Oct 1, 2021 3:00 pm IST

అఖిల్ అక్కినేని హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్. ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ 2 పతాకంపై బన్నీ వాసు మరియు వాసు వర్మ లు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబంధించిన ప్రచార, చిత్రాలు, పాటలు ఈ సినిమా పై ఆసక్తి ను పెంచేశాయి. తాజాగా ఈ చిత్రం నుండి ట్రైలర్ విడుదల అయిన సంగతి అందరికీ తెలిసిందే.

విడుదలైన ఈ చిత్రం ట్రైలర్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అంతేకాక యూ ట్యూబ్ లో సైతం టాప్ లో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్ 5 మిలియన్ కి పైగా వ్యూస్ ను సొంతం చేసుకోవడం జరిగింది. ఈ చిత్రం ను అక్టోబర్ 15 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :