మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్: బాలీవుడ్‌లో మరో విడాకులు.. అసలు కారణం ఇదే!

మౌనీ రాయ్ ఎమోషనల్ పోస్ట్: బాలీవుడ్‌లో మరో విడాకులు.. అసలు కారణం ఇదే!

Published on May 14, 2026 6:52 PM IST

బాలీవుడ్ ఇండస్ట్రీలో మరో జంట విడాకుల బాట పట్టింది. ప్రముఖ నటి మౌనీ రాయ్, తన భర్త సూరజ్ నంబియార్‌తో విడిపోతున్నట్లు సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించారు. గత కొంతకాలంగా వీరి బంధంపై నెట్టింట రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజాగా ఆ వార్తలకు ముగింపు పలుకుతూ తమ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాల ద్వారా ఈ జంట ఒక జాయింట్ స్టేట్‌మెంట్ విడుదల చేసింది.

తమ వ్యక్తిగత ప్రాధాన్యతలు మారిన నేపథ్యంలో, పరస్పర గౌరవంతో విడిపోయి వేర్వేరు మార్గాల్లో ప్రయాణించాలని నిర్ణయించుకున్నట్లు వారు వెల్లడించారు. ఇద్దరు కూర్చుని మాట్లాడుకున్న తర్వాతే, స్నేహపూర్వకంగా ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. అయితే, విడిపోయినా భవిష్యత్తులో మంచి స్నేహితులుగా కొనసాగుతామని స్పష్టం చేశారు.

ఇదే సమయంలో మీడియా అత్యుత్సాహంపై మౌనీ రాయ్ దంపతులు అసహనం వ్యక్తం చేశారు. తమ ప్రైవేట్ లైఫ్‌కు సంబంధించి వస్తున్న తప్పుడు వార్తలను, కల్పిత కథనాలను తీవ్రంగా ఖండించారు. అవన్నీ అవాస్తవాలని, తమ బంధం గురించి బయట జరుగుతున్న ప్రచారంలో ఎలాంటి నిజం లేదని కొట్టిపారేశారు. ప్రస్తుతానికి ఈ కష్ట కాలాన్ని ప్రశాంతంగా దాటాలని భావిస్తున్నామని, తమ నిర్ణయాన్ని అర్థం చేసుకుని ప్రైవసీని గౌరవించాలని అభిమానులను వారు కోరారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు