ఇంటర్వ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది – “మిస్సింగ్” మూవీ డైరక్టర్!

ఇంటర్వ్యూ: ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది – “మిస్సింగ్” మూవీ డైరక్టర్!

Published on Nov 18, 2021 5:10 PM IST

హర్ష నర్రా, నిఖిశా ప్రధాన పాత్రల్లో శ్రీని జోస్యుల దర్శకత్వం లో తెరకెక్కిన తాజా చిత్రం మిస్సింగ్. ఈ చిత్రం ను భాస్కర్ జోస్యుల మరియు శేషగిరి రావు నర్రా లు నిర్మించడం జరిగింది. అజయ్ అరసద ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రం 19 నవంబరు థియేటర్ల లో విడుదల అవుతున్న సందర్భం గా చిత్ర యూనిట్ మీడియా తో చిట్ చాట్ నిర్వహించడం జరిగింది.

అపరిచితుడు బేస్ ప్లాట్ ను తీసుకున్నారా? మల్టిపుల్ డిస్ఆర్డర్ అని?

అవును సార్, తీసుకున్నాను. సినిమా ఒక అబద్ధం తో స్టార్ట్ చేసి, ఎండింగ్ కూడా ఒక అబద్ధం ఏమో అని ఎండ్ చేయాలనేది ప్లాన్. గ్రేట్ స్క్రీన్ ప్లే అనేది దేనితో అయితే ఓపెన్ అవుతుందో, దాంతోనే ఎండ్ అవుతుంది అని నేను చదివా. అలా తీసుకోవడం జరిగింది.

ఇంగ్లీష్ లో చాలా థ్రిల్లర్ మూవీస్ వచ్చాయి. ఈ చిత్రానికి స్పూర్తి?

థ్రిల్లర్ నా జానర్ కాదు, కానీ, నా లైఫ్ స్టార్ట్ చేయడానికి కరెక్ట్ అని అనిపించింది. తక్కువలో అవుతుంది, ఎక్కువ రీచ్ ఉంటుంది. అందరూ ఇష్టపడే జానర్.

ఫస్ట్ సినిమా కదా, ఎందుకు రిస్క్ చేశారు?

రిస్క్ ఏం అనిపించలేదు. మొదలు పెట్టినప్పుడు రిస్క్ లేదు. మంచి సబ్జెక్ట్ తీసుకున్నాం అని అనిపించింది.

నటీనటులను ఎలా తీసుకున్నారు?

ఆడిషన్స్ చేశాం, నిఖిషా చేయగలదు అని అనిపించి తీసుకున్నాం, చాలా ఆడిషన్స్ తర్వాత తను ఫైనల్ అయ్యింది. హర్ష మొదటి నుండి నా ఫ్రెండ్. తను ఎలాంటి పాత్ర అయిన చేయగలడు అనేది నా నమ్మకం. ఇప్పుడు చాలా మంది మాట్లాడుతున్నారు అంటే అది తను చేసిందే. ఇంటెలిజెంట్ గా ఉండాలి, బబ్లీ గా ఉండాలి అని నిషా ను సెలెక్ట్ చేయడం జరిగింది.

కంటెంట్ బావున్నప్పుడు, బాగా ఫేం ఉన్న వారిని తీసుకుంటే బావుండేది కదా?

లిమిటెడ్ బడ్జెట్ లో చేద్దాం అని ముందుగా ప్లాన్ చేసుకున్నాం, కరోనా కారణం గా రెండేళ్లు ఎగిరి పోయాయి. తక్కువ బడ్జెట్ కావడం తో ఫేం ఉన్న ఆర్టిస్ట్ లతో చేయలేదు.

డెబ్యూ డైరెక్టర్ కదా, ఇండస్ట్రీ లో ఎంకరేజ్ మెంట్ ఎలా ఉంది.

ఎప్పుడూ ఉంది సర్. టాలెంట్ ఉంటే కచ్చితంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ అందుకే అంత పెద్ద హిట్ అయ్యింది. టాలెంట్ ఉన్న ప్లేస్ లో సపోర్ట్ ఉంటుంది.

ఎన్ని థియేటర్ల లో రిలీజ్ చేస్తున్నారు?

హైదరాబాద్ లో 30 కి పైగా ఇచ్చారు. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ లో కలిపి 100 కు పైగా ఇచ్చారు. తెలంగాణ లో ఏషియన్ వాళ్ళు, ఆంధ్రా లో గీతా ఆర్ట్స్ మరియు యూ వీ వాళ్ళు రిలీజ్ చేస్తున్నారు.

ముందుగా 80 లక్షలు బడ్జెట్ అని అనుకొని దిగాం, లోకేషన్స్, లైటింగ్ కి ఎక్కువ ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంది అనుకొని కోటి 20 లక్షలతో ఫినిష్ చేద్దాం అని అనుకున్నాం. ఫైట్ మాస్టర్ కారణం గా మొత్తం రీ షూట్ చేయాల్సి వచ్చింది. 2 డేస్, 4 కాల్ షీట్స్ వేస్ట్ అయ్యాయి.

ముందుగా ఈ చిత్రం కోసం సీనియర్ నరేష్ అనుకున్నాం, కానీ, హర్ష ను చూశాక చాలా మారిపోయాయి. హర్ష కి ఈక్వల్ గా రామ్ ను తీసుకున్నాం.

బెస్ట్ కాంప్లిమెట్ ఫస్ట్ ఎవరి నుండి వచ్చింది?

ప్రెస్ నుండి వచ్చింది సర్, మంచి రెస్పాన్స్ వచ్చింది. బతికి పోయాం అని అనుకున్నాం. తర్వాత విజయ్ భాస్కర్ గారు చాలా మెచ్చుకున్నారు. తర్వాత చందు మొండేటి గారు, శివ బాలాజీ చాలా ఎగ్జైట్ అయ్యారు.

నెక్స్ట్ ఏం ప్లాన్ చేస్తున్నారు?

ఒక లవ్ స్టోరీ అనుకుంటున్నా, లవ్ స్టొరీ లా కాకుండా యూనిక్ గా ఉండే స్టోరీ అనుకుంటున్నా.

ఓటిటి నుండి ఏమైనా ఆఫర్స్ వచ్చాయా?

వచ్చాయి. కానీ థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ కోసం అని ఉంచాం. అంతేకాక ఓటిటి లో సౌండ్ ఎక్స్ పీరియన్స్ చాలా తక్కువ. చాలా మంది ఫోన్స్ లో చూస్తారు. అలా చూస్తే విజువల్స్ మరియు సౌండ్ ఎక్స్ పీరియన్స్ ఎలా వస్తది. సినిమా ఫీల్డ్ కి రావడానికి ముఖ్య కారణమే థియేటర్స్. చిరంజీవి కనిపిస్తే విజిల్స్ వేయడానికి కారణం థియేటర్స్. బాలయ్య గారిని చూసి అంత అడ్మైర్ అవుతున్నాం అంటేనే థియేటర్స్. వాళ్ళు లార్హర్ థాన్ లైఫ్ లా అనిపిస్తారు. థియేటర్ అనేది నా లవ్ సర్.

ఓటిటి రాంగ్ అని నేను అనను, నెక్స్ట్ అదే లైఫ్. కానీ ధియేటర్ ఎప్పటికీ నంబర్ వన్ ప్లేస్ లో ఉంటుంది.

నెక్స్ట్ ఎవరితో చేయాలని ఉంది?

నాని, ప్రభాస్, అందరితో చేయాలని ఉంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు