ఓటీటీ / థియేటర్ : ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

ఓటీటీ / థియేటర్ : ఈ వారం సందడి చేయబోతున్న సినిమాలు ఇవే..!

Published on Feb 2, 2026 11:16 AM IST

OTT 02

ప్రతి వారం లాగే ఈ వారం కూడా బాక్సాఫీస్ దగ్గర పలు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. అయితే, సంక్రాంతి సీజన్ ముగియడంతో ఇప్పుడు చిన్న సినిమాలు వరుసగా బాక్సాఫీస్ దగ్గర రిలీజ్ కానున్నాయి.

ఈ వారం టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర చాలా సినిమాలు రిలీజ్‌కు వస్తున్నా వాటిలో స్టార్ క్యాస్టింగ్ లేకపోవడంతో బజ్ అంతంత మాత్రంగా ఉంది. గుణశేఖర్ తెరకెక్కించిన యుఫోరియా, సుమతీ శతకం, శ్రీ చిదంబరం గారు, హనీ, ఆపరేషన్ పద్మ, లగ్గం టైం, విత్ లవ్ వంటి సినిమాలు ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అయ్యాయి. ఇక వీటితో పాటు ఓటీటీలో (OTT) పలు చిత్రాలు, సిరీస్‌లు ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.

OTT Releases This Week ఈ వారం ఓటీటీలో (OTT) సందడి చేయబోతున్న చిత్రాలు / సిరీస్‌లు ఇవే..

నెట్‌ఫ్లిక్స్ :

క్యాష్ క్వీన్స్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 4
ది లింకన్ లాయర్ 4 (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 5
సాల్వడార్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

అమెజాన్ ప్రైమ్ :

నారీ నారీ నడుమ మురారి – ఫిబ్రవరి 4
రిలేషన్‌షిప్ గోల్స్ – ఫిబ్రవరి 4
ఫైండింగ్ హార్మోని – ఫిబ్రవరి 6
ఎల్ఓఎల్ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

జియో హాట్‌స్టార్ :

ది రాజా సాబ్ – ఫిబ్రవరి 6

జీ5 :

షబద్ రీత్ ఔర్ రివాజ్ (సిరీస్) – ఫిబ్రవరి 6

సోనీ లివ్ :

జాజ్ సిటీ (వెబ్ సిరీస్) – ఫిబ్రవరి 6

ఆహా :

సైక్ సిద్ధార్థ్ – ఫిబ్రవరి 4

తాజా వార్తలు