న్యూ ఇయర్ రోజున సప్రైజ్ ఇవ్వనున్న మిస్టర్ మజ్ను ?

Published on Dec 29, 2018 11:00 pm IST

అక్కినేని యువ హీరో అఖిల్ నటిస్తున్న మూడవ చిత్రం ‘మిస్టర్ మజ్ను’ చిత్రంలోని రెండు పాటలు ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ ను రాబట్టుకున్నాయి. ఇక ఈ చిత్రం యొక్క టీజర్ ను న్యూ ఇయర్ రోజున జనవరి 1 కి విడుదలచేయాలని ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. మరి అఖిల్ ఆ రోజు అక్కినేని అభిమానులను సప్రైజ్ చేస్తాడో లేదో తెలియాలంటే అధికారిక ప్రకటన వెలుబడే వరకు వేచి చూడాల్సిందే.

ఇక మొదటి చిత్రం ‘తొలిప్రేమ’ తో మంచి హిట్ కొట్టిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈచిత్రంపై అక్కినేని ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. జనవరి మొదటి వారంలో ఈ చిత్రం యొక్క షూటింగ్ పూర్తి కానుంది. యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ చిత్రంలో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం నిర్మాతగా ఆయనకు 25వదికావడం అలాగే వచ్చే ఏడాది జనవరి 25 నే ఈచిత్రం విడుదలకానుండడం విశేషం.

సంబంధిత సమాచారం :