టీజర్ తో అంచనాలను అందుకోలేకపోయిన ‘మిస్టర్ మజ్ను’ !

Published on Jan 3, 2019 12:24 pm IST

అక్కినేని అఖిల్ మూడవ చిత్రంగా తెరకెక్కుతున్న చిత్రం ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రం యొక్క టీజర్ ఈ రోజు సాయంత్రం ఆరు గంటలకు విడుదలయింది. ఆయితే టీజర్ మాత్రం అంచనాలను అందుకోలేకపోయింది. 56 సెకన్ల నిడివి గల ఈ టీజర్లో కేవలం అఖిల్ ని స్టైలిష్ గా చూపించే ప్రయత్నం చేసారే తప్ప.. ఎక్కడా ఆకట్టుకునే విధంగా టీజర్ ను మలచలేకపోయారు. టీజర్ పక్కా రొటీన్ గానే సాగింది. దానికి తోడు టీజర్ అంతా విదేశాల్లో షాట్ లే ఎక్కువ కనిపిస్తుండడంతో అప్పుడే “ఆరెంజ్ 2” అంటూ నెటిజన్స్ ట్రోల్ల్స్ కూడా మొదలు పెట్టేసారు. మరి ట్రైలర్ లో అయినా సరే ఎమన్నా కొత్తదనాన్ని చూపిస్తారో లేదో వేచి చూడాలి.

ఇక ఈ చిత్రం ఫై అక్కినేని అభిమానులు భారీ ఆశలు పెట్టుకున్నారు. మరి వారి ఆశలు ఎంత మేరకు నెరవేరతాయో చూడాలి. ‘తొలిప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరి తెరకెక్కిస్తున్న ఈ యూత్ ఫుల్ ఎంటర్టైనర్లో అఖిల్ సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తుంది. కాగా తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్విసిసి పతాకం ఫై బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సంబంధిత సమాచారం :

X
More