తమిళ భాషలో శక్తి చిదంబరం దర్శకత్వంలో ప్రభుదేవా, అదాశర్మ, నిక్కగల్రాని హీరో హీరోయిన్లుగా నటించిన ‘చార్లీ చాప్లిన్’ ఇటీవల విడుదలై విజయం సాధించి మంచి వసూళ్లు రాబట్టింది. ఇక తాజాగా ఈ చిత్రాన్ని శ్రీ తారకరామ పిక్చర్స్ పతాకంపై ఎమ్ .వి. కృష్ణ సమర్పణలో వి.శ్రీనివాసరావు తెలుగులో కి ‘మిస్టర్ ప్రేమికుడు’ పేరుతో అనువదిస్తున్నారు. కోలీవుడ్ లోప్రస్తుతం తెలుగు అనువాద కార్యక్రమాలు ఫైనల్ దశలో ఉన్నాయి. ఈ నెలలోనే ఈ సినిమాను గ్రాండ్ గా రిలీజ్ కానుంది.
ఈ సందర్భంగా నిర్మాత వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందిన ఈ చిత్రంలోని పాటలతో పాటు సెకండాఫ్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకు హైలెట్ గా నిలవనున్నాయి. త్వరలో ఆడియో విడుదల చేసిన ఈ నెలలోనే సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాం అన్నారు.


