హీరోయిన్ మృణాల్ ఠాకూర్.. ‘సీతారామం’, ‘హాయ్ నాన్న’ తదితర చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గర అయింది. తాజాగా అడివి శేష్‌తో కలిసి ‘డెకాయిట్’ చిత్రంలో నటించింది. ఆ చిత్రం ఈ నెల 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మృణాల్ ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ క్రమంలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. మృణాల్ ఠాకూర్ మాట్లాడుతూ.. ‘సరికొత్త నేపథ్యంలో సాగే కథలు అంటే నాకు ఇష్టం. ఇవే నన్ను నటిగా ఎక్కువగా ఆకర్షిస్తుంటాయి. ‘డెకాయిట్’ చేయడానికీ కారణం ఆ అంశమే’ అని మృణాల్ చెప్పుకొచ్చింది.
మృణాల్ ఠాకూర్ ఇంకా మాట్లాడుతూ.. ‘ఈ సినిమాలో నేను సరస్వతి అనే యువతిగా కనిపిస్తాను. హరి పాత్రలో శేష్ కనిపిస్తాడు. ఈ రోమియో, జూలియట్… డెకాయిట్స్‌గా ఎందుకు మారాల్సి వచ్చిందనేది ఈ సినిమాలో కీలకం. ఈ పాయింట్ చుట్టూ వచ్చే డ్రామా బాగుంటుంది. ప్రేక్షకులు ఆశ్చర్యపోయేలా చేయడం నాకు ఇష్టం. అలాంటిది ఇందులో నాకు నేనే ఆశ్చర్యపోయే పాత్రని పోషించే అవకాశం నాకు దక్కింది’ అని మృణాల్ తెలిపింది.
