థలపతి విజయ్ ను కలిసిన ఎం ఎస్ ధోనీ!

Published on Aug 12, 2021 2:48 pm IST


టీమ్ ఇండియా కి వరల్డ్ కప్ ను అందించిన మాజి కెప్టెన్ ఎం ఎస్ ధోనీ తాజాగా తమిళ స్టార్ హీరో థలపతి విజయ్ ను కలవడం జరిగింది. ఎం ఎస్ ధోనీ యాడ్ షూటింగ్ లో ఉండగా, అక్కడే దగ్గర లో గోకులం స్టూడియోస్ లో విజయ్ చిత్రం బీస్ట్ షూటింగ్ జరుగుతుందని తెలిసి విజయ్ ను కలవడం జరిగింది. థలపతి కారవన్ లో ధోనీ తో మాట్లాడిన అనంతరం మర్యాద పూర్వకంగా సెండ్ ఆఫ్ ఇవ్వడం జరిగింది. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ మరియు ధోనీ లు ఇద్దరికీ కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండటం తో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :