‘7 డేస్‌ 6 నైట్స్‌’ కూడా ‘డర్టీ హరి’ లాంటిదే !

Published on May 9, 2021 10:08 pm IST

ప్రముఖ నిర్మాత ఎం.ఎస్‌. రాజు దర్శకుడిగా ‘డర్టీ హరి’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు. ఈ చిత్రం అందించిన విజయోత్సాహంతో ఆయన మళ్ళీ మరో సినిమాని తెరకెక్కించడానికి సన్నద్ధం అవుతూ ‘7 డేస్‌ 6 నైట్స్‌’ అనే మరో ఇంట్రస్టింగ్ సినిమా చేస్తున్నారు. వైల్డ్‌ హనీ ప్రొడక్షన్‌ పతాకంపై ఎంఎస్‌ రాజు తనయుడు, నటుడు సుమంత్‌ అశ్విన్‌, ఎస్‌. రజనీకాంత్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ ఎక్కువగా ఉంటుందట. ముఖ్యంగా ఈ సినిమా యువతతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుందట.

అలాగే న్యూ ఏజ్ రొమాంటిక్ కామెడీ ఎంటర్‌టైన్‌మెంట్‌ నేపథ్యంలో సాగుతుందట. ఎం.ఎస్ రాజు మాట్లాడుతూ.. ‘గతేడాది వచ్చిన ‘డర్టీ హరి’తో నా జీవితం కొత్త మలుపు తీసుకుంది. ‘డర్టీ హరి’ని మించి ఈ చిత్రం ఉంటుంది’ అని తెలిపారు ఎం.ఎస్‌.రాజు. ‘ఎన్నో హిట్ చిత్రాలను నిర్మించిన మా నాన్నగారి సంస్థ సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ ‘7 డేస్ 6 నైట్స్’ సినిమాని సమర్పిస్తున్నందుకు ఆనందంగా ఉంది. జూన్ 7న చిత్రీకరణ ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నాం అంటూ సుమంత్‌ అశ్విన్‌ చెప్పుకొచ్చాడు. మరి ఈ సినిమాతో కూడా ఎం. ఎస్ రాజు హిట్ అందుకుంటాడేమో చూడాలి.

సంబంధిత సమాచారం :