లేటెస్ట్..”రాధే శ్యామ్” నుంచి అవైటెడ్ అప్డేట్ రాబోతోందా.?

Published on Jun 19, 2021 3:08 pm IST

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం నుంచి ఒక అప్డేట్ వస్తే బాగుంటుంది అని ఎంతో కాలం నుంచి డార్లింగ్ ఫ్యాన్స్ అనుకుంటున్నారు. మరి వారి నిరీక్షణకు త్వరలోనే తెర పడొచ్చని బజ్ వినిపిస్తుంది.

ముఖ్యంగా ఈ సినిమా నుంచి అంతా ఫస్ట్ సింగిల్ కోసం ఎదురు చూస్తుండగా దానిపైనే త్వరలో అప్డేట్ రావొచ్చేమో అని తెలుస్తుంది. మొత్తం ముగ్గురు సంగీత దర్శకులు ఈ చిత్రాన్ని అన్ని భాషల్లో సంగీతం సమకూరుస్తున్నారు. సౌత్ ఇండియన్ ఆల్బమ్ ను జస్టిన్ ప్రభాకరన్ కంపోజ్ చేస్తుండగా హిందీ ఆల్బమ్ కి గాను మిథున్ మరియు మనన్ భరద్వాజ్ లు కంపోజ్ చేస్తున్నారు.

మరి మొత్తానికి మాత్రం వీరి నుంచి ఫస్ట్ సింగిల్ రావచ్చని తెలుస్తుంది. మరి దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ బ్యూటిఫుల్ చిత్రం నుంచి సాంగ్స్ బిగ్గెస్ట్ చార్ట్ బస్టర్ అవుతాయని ఫ్యాన్స్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు మరి ఈ రొమాంటిక్ ఆల్బమ్ ఎలా ఉంటుందో చూడాలి.

సంబంధిత సమాచారం :