ట్రెండింగ్‌ లోకి ‘ముద్దాబంతి పూవు’ !

Published on Jun 26, 2019 12:00 am IST

టాలెంటెడ్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘కౌసల్య కృష్ణమూర్తి’ చిత్రంలోని ‘ముద్దాబంతి పూవు ఇలా పైట వేసెనా.. ముద్దూ ముద్దూ చూపులతో గుండె కోసెనా…’ పాట ప్రస్తుతం ట్రెండింగ్‌ లోకి ఉంది. యాజిన్‌ నిజార్‌ పాడిన ఈ పాటను రేడియో మిర్చిలో విడుదల చేశారు. కృష్ణకాంత్‌ సాహిత్యం అందించిన ఈ సాంగ్ కు దిబు నినన్‌ థామస్‌ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఇక ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్ తో పాటు నటకిరీటి డా.రాజేంద్రప్రసాద్‌ కూడా ప్రధాన పాత్రలో నటిస్తుండగా క్రియేటివ్‌ కమర్షియల్స్‌ పతాకం పై భీమనేని శ్రీనివాసరావు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. క్రియేటివ్‌ ప్రొడ్యూసర్‌ కె.ఎస్‌.రామారావు సమర్పణలో ఈ చిత్రాన్ని కె.ఎ.వల్లభ నిర్మిస్తున్నారు.

లేడీ క్రికెటర్‌ కథాంశంతో వస్తున్న ఈ విభిన్న చిత్రం విలేజ్‌ బ్యాక్‌ డ్రాప్‌లో చేసిన ఈ చిత్రం అన్నివర్గాల ఆడియన్స్‌ని అలరిస్తుందట. క్రికెట్‌ నేపథ్యంలో సాగే ఈ కథలో రైతుల సమస్యలను కూడా టచ్‌ చేస్తున్నారు. ఇక తమిళ హీరో శివకార్తికేయన్‌ ఒక స్పెషల్‌ రోల్‌ చేయడం ఈ చిత్రానికి హైలైట్‌.

ఈ పాట కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం :

X
More