నిఖిల్ ‘ముద్ర’ విడుదల తేదీ ఖరారు !

నిఖిల్ ‘ముద్ర’ విడుదల తేదీ ఖరారు !

Published on Nov 12, 2018 12:04 AM IST

యంగ్ హీరో నిఖిల్ హీరోగా టి.ఎన్ సంతోష్ దర్శకత్వంలో రాబోతున్న తాజా చిత్రం ‘ముద్ర’. ప్రస్తుతం నిర్మాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం డిసెంబర్ 28వ తేదీన విడుదల అవ్వనుందని చిత్రబృందం అధికారికంగా పోస్టర్ ద్వారా ప్రకటించింది.

కాగా తమిళంలో మంచి విజయం సాధించిన ‘కనితన్’ చిత్రానికి రీమేక్ గా ఈ చిత్రం తెరెకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో నిఖిల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడు. వైవిధ్యమైన పాత్రలు చెయ్యటానికి ఎప్పుడు ఇష్టపడే నిఖిల్.. ఈ సినిమాలో అలాంటి పాత్రతో పాటు ఓ సరి కొత్త లుక్ లో కనిపించనున్నాడు.

థ్రిల్లర్ నేపథ్యంలో రానున్న ఈ చిత్రంలో నిఖిల్ సరసన లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమాకి సామ్ సి ఎస్ సంగీతం అందిస్తుండగా.. కావ్య వేణుగోపాల్ మరియు రాజ్ కుమార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు