‘ముద్ర’ విడుదల మరోసారి వాయిదా పడనుందా ?

Published on Dec 17, 2018 10:27 pm IST

‘కిరాక్ పార్టీ’ తరువాత మరోసారి రీమేక్ నే నమ్ముకున్నాడు యువహీరో నిఖిల్. ఆయన నటించిన తాజా చిత్రం ‘ముద్ర’. తమిళంలో సూపర్ హిట్ అయినా ‘కనితన్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈచిత్రం. ఇక ఈచిత్రం నవంబర్ 8న విడుదలకావాల్సి ఉండగా అనివార్య కారణాల వల్ల వాయిదాపడింది. ఇటీవల ఈ చిత్రాన్ని డిసెంబర్ 28న విడుదలచేస్తామని ప్రకటించారు చిత్ర బృందం. అయితే ఇప్పుడు ఆ తేదీ కి కూడా విడుదలయ్యే సూచనలు లేవని సమాచారం.

ఇంకా విడుదలకు 10రోజుల సమయం కూడా లేకపోవడం అలాగే చిత్ర బృందం ప్రమోషన్స్ లో భాగంగా సినిమాకు సంబందించిన ఎలాంటి ప్రచార చిత్రాలను విడుదలచేయకవడంతో ఈ వార్తలకు భలం చేకూరింది. మరి ఈ చిత్రాన్ని అనుకున్న సమయానికి విడుదలచేస్తారో లేదా మరో కొత్త తేదీని ప్రకటిస్తారో చూడాలి.

ఇక నిఖిల్ ప్రస్తుతం ‘శాస్వ’ అనే చిత్రంలో నటిస్తున్నాడు. నూతన దర్శకుడు కిషన్ కట్టా తెరకెక్కిస్తున్న ఈచిత్రంలో నివేత థామస్ కథానాయికగా నటిస్తుంది.

సంబంధిత సమాచారం :