మహేష్ సినిమాకి అప్పటికి ముహూర్తం కుదిరిందా.?

Published on Apr 24, 2021 10:00 am IST

సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శకుడు పరశురామ్ పెట్ల తో “సర్కారు వారి పాట” అనే మాస్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మరి ఇదిలా ఉండగా మళ్ళీ కోవిడ్ సెకండ్ వేవ్ మూలాన మేకర్స్ కొంత కాలం రెండో షెడ్యూల్ ను వాయిదా వేసుకున్నారు. అయితే ఈ సినిమా లైన్ లో ఉండగానే మాటాల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఓ సినిమా ప్లాన్ చేసిన సంగతి కూడా అందరికీ తెలిసిందే.

మరి ఈ చిత్రం పై కొన్ని రోజుల నుంచి పలు ఆసక్తికర వార్తలే వినిపిస్తున్నాయి. వాటి ప్రకారం తాజాగా మరో టాక్ కూడా వినిపిస్తుంది. ఈ మోస్ట్ అవైటెడ్ చిత్రం ముహూర్తం వచ్చే మే 31 లెజెండరీ హీరో మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి పుట్టినరోజు సందర్భంగా మొదలు కానుంది అని సినీ వర్గాల టాక్. అలాగే అదే రోజున సర్కారు వారి పాట నుంచి కూడా మంచి సర్ప్రైజ్ కూడా ఉండొచ్చని అధికారిక సమాచారం. మరి వీటిలో ఏది నిజమవుతుందో వేచి చూడాలి.

సంబంధిత సమాచారం :