65 ఏళ్ళు దాటితే షూటింగ్ కి నో పర్మిషన్..!

Published on Aug 7, 2020 10:10 pm IST

ప్రపంచంలోనే కరోనా పీడిత దేశాలలో ఒకటిగా భారత్ మారిపోయింది. ఇప్పటి వరకు 20 లక్షలకు పైగా ప్రజలు దీని భారినపడ్డారు. వేలల్లో మరణాలు సంభవించాయి. ఇక దేశంలో కరోనా అధికంగా ఉన్న రాష్ట్రాలలో మహారాష్ట్ర ఒకటి. ముఖ్యంగా ముంబై నగరం కరోనా వ్యాప్తిలో ప్రమాదకర స్థాయిని కూడా దాటివేసింది. అమితాబ్ కుటుంబంతో పాటు పలువురు ప్రముఖులు కరోనా బారినపడ్డారు. కొందరు ప్రాణాలు కోల్పోవడం కూడా జరిగింది. ఇప్పట్లో కరోనా తగ్గే సూచనలు లేని పక్షంలో కొందరు షూటింగ్స్ మొదలుపెట్టారు.

స్టార్ హీరో అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ మూవీ షూటింగ్ కోసం నిన్న విదేశాలకు వెళ్లారు. కాగా షూటింగ్స్ లో పాల్గొనే నటులు, సిబ్బంది విషయంలో ముంబై హై కోర్ట్ కీలక సూచనలు చేసింది. 65 ఏళ్ళు పైబడిన నటులు, సాంకేతిక నిపుణులు షూటింగ్స్ లో పాల్గొనకూడదంటూ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. దీనితో ఎటువంటి షూటింగ్స్ లో అయినా 65 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులు పాల్గొనడానికి లేదు. ఉపాధిలేక అల్లాడుతున్న పేద సినీ కార్మికులకు ఈ నిర్ణయం ఇబ్బంది కలిగించే విషయమే.

సంబంధిత సమాచారం :

More