“హెజా” టైటిల్ వెనుకున్న అసలు అర్ధం ఇదే.!

Published on Dec 11, 2019 6:43 pm IST

తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎన్నో విలక్షణమైన పాత్రలను పోషించిన లెజెండరీ నటుడు ఎస్వి రంగరరావు గారి మనవనిగా తెలుగు తెరకు పరిచయం అయ్యి తనలోని ప్రతిభకు ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకొని సంగీతంతో పాటు “మిస్టర్ 7” అనే చిత్రంతో హీరోగా మున్నా కాశీ మెప్పించారు.ఇప్పటికే “యాక్షన్ 3డి”,”అమ్మ నాన్న ఊరెళితే”, రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించిన “కిల్లింగ్ వీరప్పన్” లాంటి చిత్రాలకు సంగీతంతో పాటు కొన్ని పాటలను కూడా సమకూర్చిన మున్నా కాశీ ప్రస్తుతం స్వీయ దర్శకత్వం,కథ మాటలు సహా సంగీతం కూడా తానే వహిస్తూ ఓ సరికొత్త జాన్రాను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నమే ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉన్న “హెజా ఎ మ్యూజికల్ హార్రర్” చిత్రం.

బిగ్ బాస్ ఫేమ్ నూతన నాయుడు,ముమైత్ ఖాన్ మరియు తనికెళ్ళ భరణి లాంటి వారు కీలక పాత్రధారులుగా నటిస్తున్న ఈ చిత్రం ఓ మ్యూజికల్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కించామని మున్నా తెలుపుతున్నారు.అలాగే హార్రర్ జానర్ అయితే ఈ మధ్య కాలంలో బాగా జనాల్లోకి వెళ్తున్నాయని ఈ జానర్ ను తాము ఎంచుకొని మ్యూజిక్ తో ఓ సరికొత్త అనుభూతిని తెలుగు ప్రేక్షకులకు అందించే ప్రయత్నం చేస్తున్నామని దర్శక హీరో మున్నా కాశీ తెలిపారు.అంతే కాకుండా తమ చిత్రంలో మంచి సందేశం కూడా ఉందని అది తప్పకుండా సినిమా చూసే వారిని మెప్పిస్తుందని నమ్మకంగా ఉన్నారు.

అయితే అసలు ఈ “హెజా” టైటిల్ ఏమిటి అని అందరికీ కాస్త ఆసక్తికరంగా ఉండొచ్చు దాని వెనుక ఉన్న అర్ధం కూడా మున్నా తెలిపారు.”హెజా” అనేది కొన్ని ప్రాంతాల్లో వ్యక్తుల పేర్లు అని దాని అర్థం “అందమైనది” అని అసలు విషయం తెలిపారు.అలాగే ఈ చిత్రానికి ఎందుకు ఆ టైటిల్‌ పెట్టాం అనేది సినిమాలో జస్టిఫై చేసి చూపించాం అని అలా సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుడు హార్ట్‌ఫుల్‌గా బాగుంది అనుకుంటే చాలు అని మున్నా ప్రస్తావించారు.వి ఎన్ వి క్రియేషన్స్ నిర్మాణ సంస్థ అధినేత కె వి ఎస్ ఎన్ మూర్తి నిర్మించిన ఈ చిత్రం ఈ డిసెంబర్ 12 న రెండు తెలుగు రాష్ట్రాల్లో సహా కర్ణాటకలో విడుదల కాబోతుంది.

సంబంధిత సమాచారం :

More