మురుగదాస్‌ నుండి మరో హిట్ గ్యారంటీ అట !

Published on Aug 9, 2020 1:07 am IST

తమిళ్ స్టార్ డైరెక్టర్స్ లోనే ప్రత్యేకమైన డైరెక్టర్ గా ఏ.ఆర్. మురుగదాస్ కు మంచి గుర్తింపు ఉంది. ఇక ఇలయదళపతి విజయ్ కొత్త చిత్రం ‘మాస్టర్’ ఇప్పటికే అన్ని పనులు పూర్తి చేసుకుని రెడీగా ఉంది. కరోనా అనంతరం విడుదలకు సిద్దమవుతుంది. ఇక విజయ్ నెక్స్ట్ సినిమా పై తాజాగా కోలీవుడ్ సర్కిల్స్ లో చర్చ మొదలైంది. మొదటి నుండి విజయ్ తరువాత సినిమా దర్శకుల జాబితాలో ఏ.ఆర్. మురుగదాసే ముందు వరుసలో ఉంది. కాగా తరువాత విజయ్ – మురగదాస్ కాంబినేషనే ఫైనల్ అయినట్లు తెలుస్తోంది.

ఇటీవలే రజనీతో ‘దర్బార్’ చిత్రం చేసి మంచి విజయాన్ని అందుకుని ఫామ్లోకి వచ్చారు మురుగదాస్. పైగా గతంలో విజయ్, మురుగదాస్ కాంబినేషన్లో రూపొందిన ‘తుపాకి, కత్తి, సర్కార్’ చిత్రాలు సూపర్ హిట్ అయ్యాయి. అందుకే వీరిది క్రేజీ కాంబినేషన్ అయింది. ఈ సారి కూడా మురుగదాస్‌ నుండి మరో హిట్ గ్యారంటీ అని విజయ్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ కాంబినేషన్ నాల్గవసారి రిపీట్ కానుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ సినిమాని నిర్మించనుంది. ఈ చిత్రం కూడా ‘తుపాకి’ తరహాలో ఉంటుందట. ఈ సినిమా డిసెంబర్ నుండి మొదలుకానుందని తెలుస్తోంది. మరి ఈ సారి కూడా ఈ కాంబినేషన్ సక్సెస్ అవుతుందేమో చూడాలి.

సంబంధిత సమాచారం :

More