‘మన్మథుడు 2’ కి సంగీత దర్శకుడుని సెలెక్ట్ చేశారు !

Published on Feb 19, 2019 10:55 am IST

‘చి ల సౌ’ ఫేమ్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో అగ్ర హీరో నాగార్జున సూపర్ హిట్ మూవీ ‘మన్మథుడు’ కు సీక్వెల్ గా తెరకెక్కునున్న ‘మన్మథుడు 2’ చిత్రంలో నటించనునున్నాడు. మార్చి 12న ఈ సినిమా లాంచ్ కానుండగా ,మొదటి షెడ్యూల్ పోర్చుగల్ లో జరుగనుంది. ఈ చిత్రం యొక్క మేజర్ పార్ట్ షూటింగ్ అంతా యూరప్ లో జరుగనుంది. ఈ చిత్రానికి ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ సంగీతం అందించనున్నాడని సమాచారం. ఆర్ఎక్స్ 100 ఆడియో నాగ్ కు బాగా నచ్చడంతో మ్యూజిక్ డైరెక్టర్ గా ఆయనను ఖరారు చేశారట.

ఇక ఈ చిత్రంలో సెన్సేషనల్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ ను కథానాయికగా తీసుకుంటారని వార్తలు వస్తున్నాయి. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ ఫై నాగార్జున ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.

సంబంధిత సమాచారం :