“భీమ్లా నాయక్” ఫస్ట్ సింగిల్ పై థమన్ కీలక వ్యాఖ్యలు

Published on Aug 24, 2021 10:09 pm IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం భీమ్లా నాయక్. ఈ చిత్రం లో రానా దగ్గుపాటి పవర్ ఫుల్ విలన్ గా కనిపించబోతున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించిన సంగతి తెలిసిందే. భారీ వ్యూస్ మరియు లైక్స్ తో వీడియో విపరీతంగా ట్రెండ్ అయ్యింది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ సింగిల్ విడుదల కి సిద్దం అవుతుంది. సెప్టెంబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఫస్ట్ సింగిల్ ను విడుదల చేయనుంది.

ఈ చిత్రానికి సంగీతం థమన్ అందిస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఫస్ట్ సింగిల్ లిరిక్స్ ను ప్రముఖ రచయిత రామజోగయ్య శాస్త్రి రాస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ థమన్ అందుకు సంబంధించిన ఒక పోస్ట్ ను సోషల్ మీడియాలో షేర్ చేశారు. అది కాస్త ఇప్పుడు వైరల్ గా మారింది. పెన్ తో అతను మాట్లాడుతారు అని, అందులో కూడా మాట్లాడతారు అంటూ చెప్పుకొచ్చారు. ఈ చిత్రానికి సాగర్ కే చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ మాటలు అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో దింపేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :