“రోర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్” మేకింగ్ వీడియో కి మ్యూజికల్ ట్రీట్!?

Published on Jul 12, 2021 8:55 pm IST

దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రౌద్రం రణం రుధిరం చిత్రం ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ చిత్రం లో టాలీవుడ్ కి చెందిన ఇద్దరు టాప్ హీరో లు అయిన జూనియర్ ఎన్టీఆర్ మరియు రామ్ చరణ్ లు ఇద్దరు కూడా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. అయితే రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో, జూనియర్ ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. అయితే మొదటి సారిగా వెండితెర పై వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. అయితే తాజాగా చిత్ర యూనిట్ ఈ చిత్రం కి సంబంధించిన మేకింగ్ వీడియో ను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా రొర్ ఆఫ్ ఆర్ ఆర్ ఆర్ కోసం సంగీత దర్శకుడు కీరవాణి మరియు సింగర్ బ్లేజ్ ఇద్దరూ కూడా కలిసి పని చేస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే మేకింగ్ వీడియో కి మ్యూజికల్ ట్రీట్ ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నెల 15 వ తేదీన ఆ మేకింగ్ వీడియో విడుదల కానుంది. అయితే ఈ చిత్రం ను ఈ ఏడాది అక్టోబర్ 13 వ తేదీన విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది.

సంబంధిత సమాచారం :