జపాన్ లో తలైవా సినిమా మళ్ళీ విడుదలవుతుంది !

Muttu

1995లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘ముత్తు’ చిత్రం అప్పట్లో ఆయన కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్స్ సాధించి సూపర్ హిట్ అయింది. కె ఎస్ రవి కుమార్ తెరకెక్కించిన ఈరొమాంటిక్ డ్రామాలో మీనా హీరోయిన్ గా నటించగా శరత్ బాబు ముఖ్య పాత్రలో నటించారు. తెలుగులో కూడా అదే టైటిల్ తో విడుదలైన ఈచిత్రం ఇక్కడ కూడా మంచి విజయం సాధించి రజినీ కి ఫ్యాన్ ఫాలోయింగ్ ను తీసుకొచ్చింది. ఇక ఈ చిత్రం 1998 లో జపాన్ లో విడుదలై $3.8 మిలియన్ వసూళ్లను రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది. ఈతరహా కలెక్షన్స్ రాబట్టిందంటేనే అర్ధం చేసుకోవచ్చు అక్కడ ఈచిత్రం ఎలా ఆడిందో.

ఇక 20 సంవత్సరాల తరువాత ఈచిత్రం మళ్ళీ జపాన్ లో విడుదలవుతుంది. ఈచిత్రంతోనే రజినీ అక్కడ కూడా అభిమానులను సంపాదించుకున్నారు. ఈ ఏడాది నవంబర్ 23న ఈచిత్రం మళ్ళీ అక్కడ విడుదలకానుంది.

Exit mobile version