శ్రీహరి హీరోగా రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో మై 3 బాక్సాఫీస్ ప్రొడక్షన్ నెంబర్ 2 మూవీ నేడు గ్రాండ్ గా ప్రారంభమైంది. ఈ మూవీని ఐదు భాషల్లో నిర్మించేందుకు మేకర్స్ సిద్ధం అయ్యారు. కాగా ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమం అలేఖ్య ఫార్మ్ వుడ్స్ హైదరాబాద్ లో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హీరో వెంకట్, డైరెక్టర్ సముద్ర పాల్గొన్నారు. పూజా కార్యక్రమం అనంతరం హీరో వెంకట్ క్లాప్ కొట్టగా డైరెక్టర్ సముద్ర గారు కెమెరా స్విచ్ ఆన్ చేసి స్క్రిప్ట్ ప్రొడ్యూసర్స్ కి ఇచ్చారు.
జాలరి టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీ యొక్క పూజా కార్యక్రమంలో నిర్మాతలు ఆదిత్య పల్లా, రఘు కుడితిపూడి, సాయికిరణ్ బత్తుల, రక్తం దశరథ్ గౌడ్ మరియు కొంతమంది ప్రముఖులు పాల్గొన్నారు. హీరో శ్రీహరికి ఇది రెండో మూవీ కాగా డైరెక్టర్ రాజ్ తాళ్లూరికి ఇది మూడవ మూవీ. రాజ్ తాళ్లూరి ఇంతకుముందు డిఫరెంట్ జానెర్ లో ఒక సినిమా తీయగా ఇది 80 ల బ్యాక్ డ్రాప్ సంబంధించిన కమర్షియల్ ఫార్మాట్ మూవీగా చెప్పుకొచ్చారు. ఇక ఈ మూవీకి సంబంధించిన రెగ్యులర్ షూటింగ్ ఫిబ్రవరి మొదటివారం నుంచి మొదలవుతుంది. ఖచ్చితంగా ఈ మూవీ అందర్నీ ఆకట్టుకుంటుందని మేకర్స్ నమ్మకాన్ని వ్యక్తం చేశారు.


